EPFO అదిరిపోయే అప్‌డేట్: పెన్షన్ ఏకంగా 7.5 రెట్లు పెరగనుందా? పూర్తి వివరాలు ఇవే!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు , పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక తీపి కబురు అందించబోతోంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కనీస పెన్షన్ పెంపు (EPFO minimum pension hike ) అంశంపై ఇప్పుడు తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) కింద అందుతున్న కనీస పెన్షన్ రూ. 1,000 నుండి ఏకంగా రూ. 7,500 వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

EPFO minimum pension hike from 1000 to 7500 ATM withdrawal and new EPS 95 updates 2026

పెన్షన్ పెంపుపై తాజా చర్చలు

చాలా కాలంగా కార్మిక సంఘాలు ఈ కనీస పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ కూడా సానుకూల సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సీరియస్‌గా తీసుకుంటే, పెన్షనర్ల ఆదాయం 7.5 రెట్లు పెరుగుతుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది.

ATM ద్వారా పీఎఫ్ విత్‌డ్రా!

పెన్షన్ పెంపుతో పాటు, EPFO మరో సంచలన మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై పీఎఫ్ డబ్బులు తీసుకోవడం మరింత సులభతరం కానుంది. త్వరలోనే ఏటీఎంల ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల అత్యవసర సమయంలో డబ్బు కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25% వడ్డీ రేటును కూడా ప్రభుత్వం త్వరలో ఖరారు చేసే అవకాశం ఉంది.

రికార్డు స్థాయిలో క్లెయిమ్ల పరిష్కారం

గతంలో పీఎఫ్ డబ్బులు రావాలంటే నెలల తరబడి సమయం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో EPFO ఏకంగా 8.31 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించి రికార్డు సృష్టించింది. ఇందులో విశేషమేమిటంటే.. దాదాపు 71 శాతం అడ్వాన్స్ క్లెయిమ్‌లు కేవలం మూడు రోజుల్లోనే సెటిల్ అయ్యాయి. ఆటోమేషన్ ప్రక్రియను పెంచడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.

డిజిటల్ విప్లవం: E-PRAAPTI పోర్టల్

చాలా మందికి పాత కంపెనీల్లో పీఎఫ్ అకౌంట్లు ఉండిపోయి, వాటి వివరాలు తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం EPFO 'E-PRAAPTI' అనే కొత్త పోర్టల్‌ను లాంచ్ చేసింది. మీ పాత ఇన్ యాక్టివ్ అకౌంట్లను ఆధార్ ద్వారా లింక్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్లను లింక్ చేయడానికి ఇప్పుడు యజమాని (Employer) పర్మిషన్ కూడా అవసరం లేదు, మీరు నేరుగానే అప్‌డేట్ చేసుకోవచ్చు.

మొత్తానికి కనీస పెన్షన్ పెంపు (EPFO minimum pension hike) పై అధికారిక ప్రకటన వస్తే మాత్రం మధ్యతరగతి ఉద్యోగులకు , పెన్షనర్లకు అంతకంటే పెద్ద వార్త మరొకటి ఉండదు. డిజిటల్ సేవలు పెరుగుతుండటంతో పీఎఫ్ సేవలు ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+