A Oneindia Venture

ఉద్యోగలకు షాక్: తగ్గిన ఈపీఎఫ్ఓ ఆదాయం, పీఎఫ్ వడ్డీ తగ్గే అవకాశం

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉంది. పెట్టుబడుల ఫ్లో, క్యాష్ ఫ్లో తగ్గడంతో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. రేట్లు తగ్గితం 60 బిలియన్ల ఈఫీఎఫ్ సబ్‌స్క్రైబర్లపై ప్రభావం పడుతుంది. FY20 ఆర్థిక సంవత్సరం ఆదాయం ఆధారంగా వడ్డీ రేట్లు ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం రెండో భాగంలో చెల్లింపులు ఉంటాయి.

8.50 శాతానికి ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం రాలేదు

8.50 శాతానికి ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం రాలేదు

ఈపీఎఫ్ఓకు చెందిన ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఆడిట్ కమిటీ (FIAC) వడ్డీ చెల్లింపు సామర్థ్యంపై అంచనా వేయడానికి త్వరలో భేటీ కానుంది. మార్చి మొదటి వారంలో 8.5 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. అయితే దీనికి ఇంకా ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం లభించలేదు. ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాతే కార్మిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును నోటిఫై చేస్తుంది.

నగదు ప్రవాహం తగ్గడంతో

నగదు ప్రవాహం తగ్గడంతో

నగదు ప్రవాహం భారీగా తగ్గిన నేపథ్యంలో గత సంవత్సం ఆధారంగా ప్రకటించిన వడ్డీ రేటు చెల్లింపులు కష్టంగా మారుతుంది. మందగమనం, ఆ తర్వాత కరోనా కారణంగా నగదు ప్రవాహం తగ్గింది. దీనిపై సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనల్ సునీల్ బర్త్‌వాల్ స్పందించలేదని వార్తలు వస్తున్నాయి.

కంపెనీలకు, ఉద్యోగులకు ప్రభుత్వం కరోనా సాయం

కంపెనీలకు, ఉద్యోగులకు ప్రభుత్వం కరోనా సాయం

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు, సంస్థలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ఊరట ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. మార్చి నుండి పలు చర్యలు తీసుకుంది. చిన్న స్థాయి కంపెనీలకు భారం లేకుండా పీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే భరించేందుకు సిద్ధపడింది. ఆరు నెలల పాటు దీనిని చెల్లిస్తోంది. పెద్ద సంస్థలు కూడా క్లిష్ట పరిస్థితులను తట్టుకునేందుకు పీఎఫ్ మొత్తాన్ని మూడు నెలల పాటు 12 శాతం నుండి 10 శాతానికి తగ్గించింది. ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్ వాటాను చెల్లించేందుకు కంపెనీలకు గడువును ఇచ్చాయి.

ఉద్యోగులకు ఈపీఎఫ్ నుండి నిధి తీసుకోవడానికి ఓకే

ఉద్యోగులకు ఈపీఎఫ్ నుండి నిధి తీసుకోవడానికి ఓకే

కరోనా నేపథ్యంలో కొన్ని కంపెనీలు వేతనాలు తగ్గించడం, ఉద్యోగాల్లో కోత విధించడం, కొంతకాలం పాటు ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసి వేతనాలు చెల్లించకపోవడం జరిగింది. ఇలాంటి ఉద్యోగుల కోసం క్లిష్ట పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ నుండి డబ్బులు తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మూడు నెలల ప్రాథమిక వేతనం లేదా పీఎఫ్ మొత్తంలో 75 శాతం... ఇందులో ఏది తక్కువైతే దానిని తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

తగ్గిన నిధుల ప్రవాహం, స్టాక్స్ అస్థిరత

తగ్గిన నిధుల ప్రవాహం, స్టాక్స్ అస్థిరత

ఇలాంటి వివిధ కారణాలతో ఈ పథకంలోకి నిధుల ప్రవాహం తగ్గడం, స్టాక్ మార్కెట్ అస్థిరత వంటి వివిధ కారణాలు రాబడిపై ప్రభావం చూపాయి. EPFO 85 శాతాన్ని డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, 15 శాతాన్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)లలో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లు అస్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, ఏప్రిల్, మే నెలల్లో రూ.11,540 కోట్ల 3.61 మిలియన్ల క్లెయిమ్స్‌ను పరిష్కరించింది. ఇందులో రూ.4,580 కోట్ల విలువైన 1.55 మిలియన్ల క్లెయిమ్స్ ఇటీవల కరోనా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రకటించిన అడ్వాన్స్‌కు సంబంధించినవని ఈ నెల ప్రారంభంలో తెలిపింది. ఇదిలా ఉండగా, గత ఏడాదికి సంబంధించిన పెట్టుబడుల రాబడిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు దీనిపై వెనక్కి పోతే అంగీకరించే ప్రసక్తి లేదని భారతీయ మజ్దూర్ సంఘ్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+