EPFO Updates: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ గడచిన కొంత కాలంగా చందాదారుల కష్టాలను తీర్చేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గతంలో మాదిరిగా పనులు పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరాన్ని టెక్నాలజీ వినియోగంతో తగ్గిస్తోంది. ఈ క్రమంలోనే మరో శుభవార్తను వెల్లడించింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్(CPPS) పదవీ విరమణ తర్వాత వారి స్వగ్రామానికి వెళ్లే పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. కొత్తగా తీసుకొచ్చిన విధానంలో పింఛనుదారులు పెన్షన్ ప్రారంభించే సమయంలో వెరిఫికేషన్ కోసం ఇకపై వివిధ బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ చెల్లింపు ఆర్డర్(PPO) జారీ చేసిన తర్వాత పించనుదారులు తమ ఇంటికి సమీపంలో ఉన్న బ్యాంకు నుంచి పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో EPFOకి చెందిన ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత.. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్-1995 కింద నెలకు ఫిక్స్‌డ్ పెన్షన్ పొందుతున్నారు. ఈ క్రమంలో రిటైర్డ్ ఉద్యోగి తన పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి.. అతను పదవీ విరమణ చేసిన ప్రాంతానికి సంబంధించిన బ్యాంకు శాఖకు వెళ్లి సదరు మెుత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నారు. దీనికి కారణం EPFO వివిధ ప్రాంతీయ కార్యాలయాలుగా విభజించబడటమే. ప్రతి ప్రాంతీయ కార్యాలయంలోని కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు శాఖలకు మాత్రమే పెన్షన్ ఉపసంహరణకు అధికారం ఉంది. దీంతో చాలా మంది పెన్షనర్లు డబ్బును తీసుకోవటంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
పదవీ విరమణ తర్వాత చాలా మంది ఉద్యోగులు తమ గ్రామంలో లేదా మరేదైనా ప్రాంతంలో నివసిస్తుంటారు. దీంతో వారు పెన్షన్ విత్‌డ్రా కోసం బ్యాంక్ బ్రాంచ్ తిరగవలసి ఉంటుంది. అయితే ఈ కష్టాలకు ఇక చెక్ పడనుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధునికీకరణ ప్రాజెక్ట్ సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్(CITES 2.01)లో భాగంగా జనవరి 1, 2025 నుంచి కొత్త సౌకర్యం ప్రారంభించబడుతుంది. దీని తర్వాత CPPS ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థకు సున్నితమైన పరివర్తనను తీసుకువస్తుంది. కొత్త విధానంతో పెన్షనర్లు పెన్షన్ చెల్లింపు ఆర్డర్(PPO)ను ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి బదిలీ చేయవలసిన అవసరం ఉండదు. కొత్త ముందడుగుతో పింఛన్‌దారుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమౌతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications