Patytm News: పేటీఎంకు EPFO ఝలక్.. ఆర్బీఐ ఆంక్షల అమలు.. ఉద్యోగులూ ఇది గమనించండి!

EPFO News: కరోనా విజృంభణ వేళ డిజిటల్ పేమెంట్స్ పేరిట పేటీఎం సునామీలా దూసుకొచ్చింది. తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షల వల్ల అంతే వేగంగా దాని ప్రతిష్ఠ మసకబారుతోంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్ ద్వారా లావాదేవీలను వివిధ సంస్థలు అంగీకరించని పరిస్థితి ఏర్పడింది.

పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్(PPBL) ఖాతాలు ఉపయోగించి చేసే డిపాజిట్లు మరియు క్రెడిట్ లావాదేవీలను ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(EPFO) పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23 నుంచి ఆ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానించబడిన క్లెయిమ్‌లు ఆమోదించడాన్ని ఆపివేయాలని అన్ని ఫీల్డ్ ఆఫీస్‌లకు ఆదేశాలు జారీచేసింది.

EPFO holds Paytm Payment Bank account transactions

ఆర్బీఐ నిబంధనల మేరకు ఆంక్షలను అమలుచేయడానికి EPFO సిద్ధమైంది. ఈమేరకు ఫిబ్రవరి 8న ఓ సర్క్యులర్‌ జారీ చేసి తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. సదరు మార్పు గురించి ఉద్యోగులకు అవగాహన పెంచడానికి ప్రచారం ప్రారంభించాలని సూచించింది.

ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ ఖాతాలలో డిపాజిట్స్ మరియు క్రెడిట్ లావాదేవీలపై RBI పరిమితులు విధించింది. ఈ నేపథ్యంలో PPBL ద్వారా జరిగే లావాదేవీలను ​​తన నెట్‌వర్క్‌కు దూరంగా ఉంచాలని చూస్తోంది. తన నిర్ణయానికి ఉద్యోగులు సహకరించాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+