ఈపీఎఫ్ఓ (EPFO) తన క్లెయిమ్ నియమాలను మార్చింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది చందాదారులకు భారీ ఉపశమనం పొందనున్నారు. ఇప్పుడు ఈఫీఎఫ్(EPF) క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం క్యాన్సల్ చెక్కు లేదా బ్యాంక్ పాస్‌బుక్ అవసరం లేదు. ఈ విషయంలో సమాచారం ఇస్తూ ఈపీఎఫ్ఓ ఒక సబ్‌స్క్రైబర్ అన్ని ఇతర షరతులను నెరవేర్చినట్లయితే, అటువంటి పరిస్థితిలో అతను క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం చెక్ బుక్ లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇది ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కేసులను వేగవంతం చేస్తుంది. చెక్ లీఫ్ లేదా అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ కాపీని అప్‌లోడ్ చేయనందున ఈపీఎఫ్ఓ అనేక క్లెయిమ్‌లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన క్లెయిమ్‌ల పరిష్కారం కోసం ఈపీఎఫ్‌ఓ నిబంధనలను మార్చిందని మే 28న ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌ను జారీ చేసింది. చెక్ లీఫ్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌లోడ్ చేయనందున క్లెయిమ్ తిరస్కరణల సంఖ్యను తగ్గించడానికి నిబంధనలలో స్వల్ప మార్పులు చేసినట్లు వివరించింది.

ఇతర ధ్రువీకరణలు పూర్తయిన ఈపీఎఫ్ఓ సభ్యులకు మాత్రమే మినహాయింపు లభిస్తుందని ఈపీఎఫ్ఓ తన సర్క్యులర్‌లో తెలియజేసింది. బ్యాంక్ ఆన్‌లైన్ KYC ధృవీకరణ, DSC (డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్) ద్వారా యజమాని పూర్తి చేయాల్సిన బ్యాంక్ KYC ధృవీకరణ, UIDAI ద్వారా ఆధార్ నంబర్ ధృవీకరణ వంటివి పూర్తి చేస్తే క్యాన్సల్ చెక్కు లేదా బ్యాంక్ పాస్‌బుక్ అప్ లోడ్ చేయకున్నా క్లైమ్ అంగీకరిస్తారు. ఇంతకు ముందు, ఈపీఎఫ్ క్లెయిమ్‌ను పూర్తి చేయడానికి, సభ్యుని పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్‌తో కూడిన మీ ఖాతా క్యాన్సల్ చేసి చెక్ అవసరం ఉండేది.
దీనితో, ఈపీఎఫ్ మీ బ్యాంక్ ఖాతా వివరాలను పొందుతుంది. చెక్ అందుబాటులో లేని పక్షంలో, ఈపీఎఫ్ సభ్యుడు బ్యాంక్ పాస్‌బుక్‌ను (బ్యాంకు మేనేజర్ సంతకం కలిగి ఉంటుంది) ఖాతా వివరాలుగా కూడా సమర్పించవచ్చు. దీని కోసం ఈపీఎఫ్ సభ్యునికి యూనివర్సల్ ఖాతా నంబర్ ఉండటం అవసరం. దీనితో పాటు, మీ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతాను KYC పూర్తి చేయడంతో పాటు UAN నంబర్‌తో ధృవీకరించడం అవసరం.


Click it and Unblock the Notifications