తాజగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై 8.25% వడ్డీ ఇవ్వాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. వడ్డీ రేటును 8.25% వద్ద స్థిరంగా ఉంచడం ఇది వరుసగా రెండో సంవత్సరం. అంటే 7 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులకు గత సంవత్సరంలాగానే వడ్డీ లభిస్తుంది.
PF వడ్డీ రేటు ఏ సంవత్సరంలో ఎంత అంటే ?
EPF వడ్డీ రేట్లు గత కొన్ని సంవత్సరాలుగా హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. అయితే ఏ సంవత్సరంలో ఎంత ఉందో చూస్తే
*2023-24: 8.25%
*2022-23: 8.15%
*2021-22: 8.1% (గత 40 ఏళ్లలో అత్యల్పం)
*2020-21: 8.5%
*2019-20: 8.5%
*2018-19లో 8.65%

2016-17లో EPFO 8.65 శాతం వడ్డీ రేటును, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. అలాగే 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతంగా కాస్త పెరిగింది. అంతకుముందు ఏడాది 2013-14 అలాగే 2014-15 సంవత్సరాల్లో 8.75 శాతం వడ్డీని చెల్లించింది, ఇది 2012-13లో 8.5 శాతం కంటే ఎక్కువ. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. EPFO అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. ఇప్పుడు ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతుంది, అక్కడ ఆమోదం తర్వాత వడ్డీ మొత్తం కస్టమర్ల PF అకౌంటుకు బదిలీ అవుతుంది.
ఈ నిర్ణయం ఉద్యోగులపై ప్రభావం
ఈసారి EPFO వడ్డీ రేటును పెంచలేదు అలాగే ఎలాంటి తగ్గింపు కూడా చేయలేదు. ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించిన తర్వాత ఇపిఎఫ్‌ఓ కూడా వడ్డీ రేట్లను కొద్దిగా తగ్గించవచ్చని భయపడ్డారు. ఇలాంటి పరిస్థితిలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం కూడా కోట్లాది మంది ఉద్యోగులకు ఉపశమనం కలిగించే నిర్ణయం. గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో 8.25% రేటు ఇప్పటికీ సంతృప్తికరమైన రాబడిగా పరిగణించవచ్చు.
EPF అనేది ఉద్యోగుల కోసం ఒక సేవింగ్స్ స్కిం. దీని ద్వారా ఉద్యోగుల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. EPFలో ఉద్యోగి, యజమాని ఇద్దరూ సమానంగా డబ్బును జమ చేస్తారు. ఈ డబ్బుకు ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. EPF అకౌంట్ నుంచి డబ్బును కొన్ని పరిస్థితుల్లో మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications