జాబ్ మానేసిన, కొలువు కోల్పోయిన ఉద్యోగులు రెండు నెలల తర్వాత తమ ప్రావిడెంట్ ఫండ్(EPF)లోని అమౌంట్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం సదరు కంపెనీ 'డేట్ ఆఫ్ ఎగ్జిట్'ను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా జాబ్ మారిన ఉద్యోగులకు కొత్త కంపెనీలు సైతం EPF అకౌంట్ క్రియేట్ చేస్తుంటాయి. ఇందుకూ 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' చాలా కీలకం. దీనిపై EPFO తాజాగా ఓ శుభవార్త చెప్పింది.
ఇక నుంచి ఉద్యోగులు తమ 'డేట్ ఆఫ్ ఎగ్జిట్'ను తామే అప్ డేట్ చేసుకునే వెసులుబాటును EPFO కల్పించింది. ఈ వ్యవహారాన్ని ఆన్ లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు. ఈ మేరకు రిటైర్ మెంట్ ఫండ్ బాడీ ట్వీట్ చేసింది. అయితే గత 2 నెలల్లో కంపెనీ తరపు నుంచి క్రెడిట్ కావాల్సిన PF అమౌంట్ జమకాని పక్షంలోనే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందని గమనించాలి.

EPFO నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి మరొక సంస్థలో చేరినప్పుడు, మునుపటి ఖాతా నుంచి అతని ప్రావిడెంట్ ఫండ్‌ను బదిలీ చేయడానికి కొత్త కంపెనీ క్రింద సభ్యునిగా నమోదు చేసుకోవాలి. ఇందుకోసం EPFO వెబ్ సైట్ లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ను అప్ డేట్ చేయడానికి ఈ 5 స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
1. మొదటగా 'మెంబర్ సేవ' పోర్టల్ URL అయిన https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ సైట్ కు వెళ్లాలి.
2. ఉద్యోగి UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
3. 'మేనేజ్' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'మార్క్ ఎగ్జిట్' ఆప్షన్ ఎంచుకోవాలి.
4. డ్రాప్‌డౌన్ జాబితా నుంచి తగిన PF ఖాతా నంబర్ సెలక్ట్ చేసుకోవాలి.
5. ఎగ్జిట్ తేదీ, కారణాన్ని నమోదు చేసి, మొబైల్ నంబర్ కి వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరి.


Click it and Unblock the Notifications