EPFO కీలక నిర్ణయం.. పాత ఫామ్స్ రద్దు.. అమల్లోకి వచ్చిన 'ఫామ్ 121'.. ఎవరికి లాభం అంటే?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పీఎఫ్ ఖాతాదారుల కోసం ఒక సరికొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఉద్యోగంలో చేరిన ఐదేళ్ల లోపే పీఎఫ్ అకౌంట్ నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే నిబంధనల ప్రకారం టాక్స్ (TDS) కట్ అవుతుంది. ఈ టాక్స్ పడకుండా ఉండడం కోసం ఇప్పటివరకు మనం ఫామ్ 15G లేదా ఫామ్ 15H సబ్మిట్ చేసేవాళ్లం. కానీ ఇకపై ఈ పాత ఫామ్స్ అన్నింటినీ రద్దు చేస్తూ, వాటి స్థానంలో 'ఫామ్ 121' (Form 121) అనే ఒకే ఒక్క యూనిఫైడ్ ఫామ్‌ను ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చింది.

దీనివల్ల ఐదేళ్ల లోపు అత్యవసరంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఉద్యోగులకు టీడీఎస్ కట్ అవ్వకుండా సులభంగా ప్రాసెస్ పూర్తవుతుంది. కేవలం ఈ ఫామ్ మాత్రమే కాకుండా, 'EPFO 3.0' డిజిటల్ ఓవర్‌హాల్ కింద మరికొన్ని సంచలన మార్పులను కూడా సంస్థ ప్రవేశపెడుతోంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

EPFO Form 121 Launched TDS Free EPF Withdrawal UPI ATM Access Rules Update

యూపీఐ (UPI), ఏటీఎం (ATM) ద్వారా పీఎఫ్ విత్‌డ్రాయల్స్!

టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఈపీఎఫ్ఓ కూడా తన సేవలను మరింత వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో కింది ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి..

  • UPI ద్వారా ట్రాన్స్‌ఫర్: ఇకపై మీ పీఎఫ్ అకౌంట్‌లో విత్‌డ్రా చేయడానికి అర్హత ఉన్న బ్యాలెన్స్‌ను నేరుగా మీ యూపీఐ పిన్ (UPI PIN) ఎంటర్ చేసి, లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు ఇన్‌స్టంట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టెస్టింగ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది.
  • ATM లాంటి సదుపాయం: అత్యవసర సమయాల్లో బ్యాంకు ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసినట్లే, పీఎఫ్ సేవింగ్స్ నుండి కూడా సులభంగా విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ను ప్రతిపాదిస్తున్నారు.
  • 75% బ్యాలెన్స్ యాక్సెస్: అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు తమ పీఎఫ్ బ్యాలెన్స్ నుండి గరిష్టంగా 75 శాతం వరకు చాలా సులభంగా, ఫ్లెక్సిబుల్‌గా వాడుకునే వెసులుబాటును EPFO 3.0 కల్పిస్తోంది.

ముందే డబ్బులు తీస్తే భారీ నష్టం! ఎందుకంటే..

కొత్త రూల్స్ వల్ల డబ్బులు తీయడం సులభం అయినప్పటికీ, ఉద్యోగులు ముందే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం అస్సలు మంచిది కాదని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పీఎఫ్ డబ్బులపై లభించే కాంపౌండింగ్ (చక్రవడ్డీ) పవర్ వల్ల భవిష్యత్తులో వచ్చే లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు, 30 ఏళ్ల వయసున్న ఒక ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్ నుండి రూ.5 లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు అనుకుందాం. ప్రస్తుతమున్న 8.25% వడ్డీ రేటు ప్రకారం.. ఆ ఐదు లక్షల రూపాయలను అలాగే అకౌంట్‌లో వదిలేస్తే, అతను రిటైర్ అయ్యే సమయానికి ఆ అమౌంట్ ఏకంగా రూ.45 లక్షలుగా పెరుగుతుంది! అంటే ఇప్పుడు తొందరపడి రూ.5 లక్షలు తీసేస్తే, ఫ్యూచర్‌లో వచ్చే రూ.40 లక్షల అదనపు లాభాన్ని చేజేతులా నష్టపోయినట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+