EPFO చందాదారులకు గుడ్‌న్యూస్. ఈ-నామినేషన్ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్ఓ పొడిగించింది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత కూడా ఈ నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. సబ్‌స్క్రైబర్లు సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేసే ప్రయత్నాలు చేసిన సందర్భంలో ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్యగా మారింది. దీంతో పలువురు వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న అనంతరం డిసెంబర్ 31వ తేదీ తర్వాత నామినీ వివరాలను అప్ డేట్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

ఈ-నామినేషన్ దాఖలు చేస్తే..
EPFO ప్రకారం ఒక వ్యక్తి ఈ-నామినేషన్‌ను దాఖలు చేయాలి. ఎందుకంటే ఇది సభ్యుని మరణం తర్వాత పెన్షన్ (ఎంప్లాయీస్ డిజిటల్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్), ప్రావిడెంట్ ఫండ్(PF), ఇన్సురెన్స్ (ఉద్యోగుల డిజిటల్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్) ప్రయోజనాలను సులభంగా పొందడంలో ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ క్లెయిమ్స్ ఫైల్ చేయడానికి నామినీని ఎనేబుల్ చేయాలి.
EPFO సబ్‌స్క్రైబర్లు తమ కుటుంబాలకు సామాజిక భద్రతను అందించేందుకు ఈ-నామినేషన్‌ను దాఖలు చేయడం మంచిది. నామినేషన్ డిజిటల్‌గా దాఖలు చేయడానికి కింది దశలను అనుసరించాలి. సబ్‌స్క్రైబర్లు ఒకటి కంటే ఎక్కువసార్లు పీఎఫ్ నామినీని జత చేయవచ్చు. ఈపీఎఫ్ నామినేషన్ ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన తర్వాత ఇందుకు సంబంధించిన పత్రాలను నేరుగా ఇవ్వాల్సిన అవసరం లేదు.

పీఎఫ్ నామినేషన్ దాఖలు ఇలా..
- మొదట epfindia.gov.in లో లాగ్-ఇన్ కావాలి.
- సర్వీసెస్ సెక్షన్‌కి వెళ్లి ఫర్ ఎంప్లాయీస్(For Employees) బటన్ పైన క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్‌లైన్ సర్వీసెస్ (ఓసీఎస్/ఓటీసీపీ) బటన్ పైన క్లిక్ చేయాలి.
- మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగ్-ఇన్ కావాలి.
- మేనేజ్ బటన్ కింద ఈ-నామినేషన్(E-Nomination) సెలెక్ట్ చేయండి.
- మీ ఫ్యామిలీ డిక్లరేషన్ అప్‌డేట్ కోసం Yesపై క్లిక్ చేయండి.
- యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ బటన్ పైన క్లిక్ చేసి వివరాలు ఇవ్వాలి.
- పీఎఫ్ మొత్తంలో ఎవరెవరికి ఎంత ఎంత మొత్తం ఇవ్వాలో తెలియజేయడానికి .నామినేషన్ డిటెయిల్స్ పైన క్లిక్ చేయాలి.
- డిక్లరేషన్ ఇచ్చాక సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ పైన క్లిక్ చేయండి.
- ఓటీపీ కోసం E-Sign బటన్ పైన క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డుతో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని నమోదు చేస్తే ఈపీఎఫ్‌లో మీ ఈ-నామినేషన్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

అక్టోబర్ సబ్‌స్క్రైబర్లు
ఇదిలా ఉండగా, అక్టోబర్ నెలలో ఈపీఎఫ్ఓకు 12.73 లక్షల సబ్‌స్క్రైబర్లు జత కలిశారు. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఇది 10.22 శాతం ఎక్కువ. ఈపీఎఫ్ పేరోల్ డేటా 20 డిసెంబర్ 2021న విడుదలైంది. 12.73 లక్షల నెట్ సబ్‌స్క్రైబర్లలో 7.57 లక్షల మంది కొత్త వారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications