EPF: ఎంప్లాయర్స్‌కు EPFO మరోసారి అవకాశం.. ఆ పని పూర్తి చేసేందుకు మరోసారి గడువు పెంపు
EPF: భవిష్యత్ ఆర్థిక అవసరాల గురించి ఆలోచించే ధోరణి ఈమధ్య ఉద్యోగుల్లో విపరీతంగా పెరుగుతోంది. వచ్చిన జీతాన్ని వెంటనే ఖర్చు చేసే అలవాటు నుంచి క్రమంగా పొదుపు, పెట్టుబడి వంటి పలు మార్గాల అన్వేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేస్తోంది.
నిబంధనలు ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ కింద నమోదైన ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తం EPF కింద కోత విధించబడుతుంది. ఇందుకు అదనంగా అంతే మొత్తాన్ని యజమాని సైతం పే చేయాల్సి ఉంది. ఈ టోటల్ అమౌంట్ లో కొంత భాగం సేవింగ్స్ కాగా మరికొంత పెన్షన్ కింద నెలనెలా జమ అవుతుంది. ఉద్యోగికి 60 ఏళ్లు వచ్చినప్పటి నుంచి వారికి ఈ పింఛను బెనిఫిట్ లభిస్తుంది.

కావాలంటే ఈ పింఛను అమౌంట్ మొత్తాన్ని పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అధిక పెన్షన్ కోసం యజమానులు తమ ఉద్యోగుల వివరాలను అప్ లోడ్ చేయడానికి గడువును EPFO తాజాగా పెంచింది. డిసెంబర్ 31 వరకు మరో అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయర్స్, ఎంప్లాయర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు గడువు పొడిగించినట్లు కార్మిక శాఖ తెలిపింది.
సెప్టెంబర్ 29 నాటికి అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న 5.52 లక్షల అప్లికేషన్స్ యజమానుల వద్ద పెండింగ్ లో ఉన్నట్లు లేబర్ మినిస్ట్రీ వెల్లడించింది. అందుకే మరో 3 నెలల సమయం ఇచ్చినట్లు చెప్పింది. ఇలా గడువు తేదీని పొడిగించడం ఇప్పటి వరకు మూడోసారి కావడం విశేషం.


Click it and Unblock the Notifications