EPF News: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. ఇకపై ఆ బాధలకు చెక్..
EPFO News Rules: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మరియు పెన్షన్ మొత్తాలను EPFO పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిబంధనల ప్రకారం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తమ PF నిధి నుంచి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం కల్పించింది. అయితే ఇందుకోసం పలు నిబంధనలు విధించింది. కానీ ఈ పద్ధతిని మరింత సులభతరం చేయడం కోసం కొన్ని వెసులుబాట్లు ఇస్తూ నిర్ణయించింది.
ప్రావిడెంట్ ఫండ్ నుంచి అమౌంట్ ఉపసంహరించాలంటే చెల్లుబాటు అయ్యే బ్యాంక్ పాస్ బుక్ లేదా చెక్ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి సరిగా లేని పక్షంలో క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. అయితే ఈ నిబంధనను మారుస్తున్నట్లు ప్రకటించింది. క్లెయిమ్‌ల ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి దీనికి బదులుగా EPFO అదనపు ధృవీకరణ పద్ధతులను ఉపయోగిస్తోంది.

ఉద్యోగి బ్యాంక్ ఖాతా సహా KYC వివరాలను NPCI ద్వారా EPFO తనిఖీ చేయనుంది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉపయోగించి ఇదే డీటెయిల్స్‌ను యజమాని కూడా ధ్రువీకరించవచ్చు. ఆధార్ నంబర్ తో UIDAI ద్వారా సీడ్ అయిన బ్యాంక్ ఖాతాను వెరిఫై చేసే అవకాశమూ ఉంది. ఇలా చేయడం వల్ల ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం అవుతుందని EPFO భావిస్తోంది. తిరస్కరణకు గురవుతున్న క్లెయిమ్‌ల సంఖ్యను ఇది తగ్గిస్తుంది.
కాబట్టి ఇప్పటికే KYC లేదా మరొక టెక్నిక్ ద్వారా బ్యాంక్ డేటా ధ్రువీకరించబడి ఉంటే ఇక ఎలాంటి డాక్యుమెంటేషన్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని EPFO సర్క్యులర్ రిలీజ్ చేసింది. లేనిపక్షంలో సభ్యుని పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్‌తో కూడిన క్యాన్సిల్డ్ చెక్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ చెక్‌బుక్ సౌకర్యం లేకపోతే పాస్ బుక్ మొదటి పేజీ కాపీపై బ్యాంక్ మేనేజర్ స్టాంప్ మరియు సంతకంతో ప్రామాణీకరించాలి.


Click it and Unblock the Notifications