EPFO : గుడ్ న్యూస్! పాత కంపెనీల చుట్టూ తిరగక్కర్లేదు.. ఆధార్‌తోనే మీ పాత PF నిధులు వాపస్!

చాలా మంది ఉద్యోగస్తులు కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు కంపెనీలు మారి, ఆ తర్వాత పాత కంపెనీకి సంబంధించిన పీఎఫ్ వివరాలను మర్చిపోతుంటారు. ముఖ్యంగా యూఏఎన్ (UAN) వ్యవస్థ రాకముందు ఉన్న పాత పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడం అంటే అది గగనమే అయ్యేది. పాత కంపెనీ చుట్టూ తిరగడం, సంతకాలు పెట్టించుకోవడం వంటి తలనొప్పులు ఉండేవి. అయితే, EPFO ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకొస్తోంది. అదే 'ఈ-ప్రాప్తి' (E-PRAAPTI) డిజిటల్ ప్లాట్‌ఫారమ్.

EPFO E-PRAAPTI Portal Access Old PF Funds Without Former Employer Help Aadhaar Linked Search

ఏమిటీ ఈ-ప్రాప్తి (E-PRAAPTI)?

ఇది ఆధార్ ఆధారిత డిజిటల్ వ్యవస్థ. పాత, ఇనాక్టివ్ (నిష్క్రియ) పీఎఫ్ ఖాతాలను గుర్తించి, ఆ నిధులను తిరిగి పొందేందుకు ఈ పోర్టల్ సహాయపడుతుంది. చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న కోట్లాది రూపాయల నిధులను నేరుగా ఉద్యోగులకే చేర్చడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీని ద్వారా మీ పాత కంపెనీ యజమానితో సంబంధం లేకుండానే మీ నిధులను మీరు యాక్సెస్ చేయవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఈ పోర్టల్ ద్వారా పాత నిధులను క్లెయిమ్ చేయడం చాలా సులభం..

  • ఆధార్ లాగిన్: ప్రాథమిక దశలో, యూజర్లు తమ ఆధార్ కార్డు వివరాలతో లాగిన్ అవ్వవచ్చు.
  • మెంబర్ ఐడి సెర్చ్: మీ పాత కంపెనీ 'మెంబర్ ఐడి' మీ దగ్గర ఉంటే, దాని ద్వారా పాత అకౌంట్‌ను వెతికి ప్రస్తుతం ఉన్న UAN తో లింక్ చేయవచ్చు.
  • ఆన్‌లైన్ కేవైసీ: ఒకసారి లింక్ చేసిన తర్వాత, కేవైసీ (KYC) వివరాలు , బ్యాంక్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసి అకౌంట్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

మెంబర్ ఐడి లేకపోయినా ఇబ్బంది లేదు!

ముందు ముందు ఈ వ్యవస్థను మరింతగా డెవలప్ చేయాలని EPFO భావిస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగి వద్ద పాత మెంబర్ ఐడి లేకపోయినా, కేవలం ఆధార్ , ఇతర ప్రాథమిక వివరాల ద్వారా పాత ఖాతాలను గుర్తించేలా టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల చాలా ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసి, ఎటువంటి డాక్యుమెంట్లు లేని సామాన్య కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది.

డిజిటల్ విప్లవంలో EPFO గణాంకాలు

'డిజిటల్ ఇండియా' పుణ్యమా అని EPFO కార్యకలాపాలు ఇప్పుడు జెట్ స్పీడ్ అందుకున్నాయి.

  • 2025 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల క్లెయిమ్‌లు పరిష్కారమవ్వగా, 2026 నాటికి ఆ సంఖ్య ఏకంగా 8.31 కోట్లకు చేరింది.
  • ప్రస్తుతం సుమారు 71% విత్‌డ్రాయల్స్ ఎలాంటి మనిషి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి.

అయితే, పాత రికార్డుల్లో పేరు, పుట్టిన తేదీ లేదా జాయినింగ్ డేట్ వంటి వివరాలు తప్పుగా ఉంటే వెరిఫికేషన్‌కు కొంచెం సమయం పట్టవచ్చు. కానీ ఈ పోర్టల్ మాత్రం పాత డబ్బులు పోయాయని ఆశ వదులుకున్న లక్షలాది మందికి ఒక గొప్ప వెలుగునిస్తోంది.

మీ కష్టార్జితం వృధా కాకూడదన్నదే ఈ ప్లాట్‌ఫారమ్ లక్ష్యం. ఒకవేళ మీకు కూడా పాత కంపెనీల్లో పీఎఫ్ డబ్బులు ఉండిపోయి ఉంటే, 'ఈ-ప్రాప్తి' పోర్టల్ అందుబాటులోకి రాగానే మీ వివరాలను సరిచూసుకుని, ఆ నిధులను క్లెయిమ్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+