ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చాలామందికి నెలవారీ పెన్షన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ సమయంలో పిల్లల పెళ్లిళ్లకో, ఇల్లు కట్టుకోవడానికో లేదా పాత అప్పులు తీర్చడానికో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. అటువంటి వారి కోసం EPFO .. 'కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్' (Commutation of Pension) అనే అద్భుతమైన సదుపాయాన్ని అందిస్తోంది. ఈ రూల్ గురించి సరైన అవగాహన ఉంటే రిటైర్మెంట్ సమయంలో లక్షల రూపాయలు పొందడమే కాకుండా, 15 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ పూర్తి పెన్షన్‌ను తిరిగి పొందవచ్చు.

కమ్యూటెడ్ పెన్షన్ అంటే ఏమిటి?
సరళంగా చెప్పాలంటే మీ భవిష్యత్తులో వచ్చే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే ఒకేసారి (Lump sum) తీసుకోవడాన్ని కమ్యూటేషన్ అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి తన ప్రాథమిక పెన్షన్‌లో గరిష్టంగా 40 శాతం వరకు ఇలా ముందే తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఉద్యోగికి నెలకు రూ.20,000 పెన్షన్ రావాల్సి ఉండి, అందులో 40 శాతం కమ్యూట్ చేస్తే.. అతనికి రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి భారీ మొత్తం అందుతుంది. అయితే ఆ తర్వాత ప్రతి నెలా వచ్చే పెన్షన్‌లో కొంత మొత్తం కోత పడుతుంది.
15 ఏళ్ల నిబంధన ఏమిటి?
చాలామంది పెన్షనర్లు తమ పెన్షన్‌లో కోత పడుతుంటే జీవితాంతం అలాగే ఉంటుందని ఆందోళన చెందుతుంటారు. కానీ, సీసీఎస్ (పెన్షన్ కమ్యూటేషన్) రూల్స్ 1981లోని రూల్ 10A ప్రకారం.. ఈ పెన్షన్ తగ్గింపు కేవలం 15 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం మీకు ముందే ఇచ్చిన నగదును 15 ఏళ్లలో మీ పెన్షన్ నుండి రికవరీ చేసుకుంటుంది. ఈ కాలం పూర్తయిన మరుసటి నెల నుండే మీకు మళ్ళీ పూర్తి పెన్షన్ అందడం ప్రారంభమవుతుంది.
ఆటోమేటిక్ గా పెన్షన్ పునరుద్ధరణ
ఈ రూల్‌లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ పొందడానికి మీరు ఎటువంటి ప్రత్యేక దరఖాస్తు (Application) చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ పెన్షన్ అందించే బ్యాంక్ లేదా సంస్థ ఆటోమేటిక్ గానే ఈ మార్పును చేస్తుంది. అయితే, పెన్షనర్లు తమ బ్యాంక్ రికార్డులను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఈ 15 ఏళ్ల కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇంకా దీనిపై ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ప్రస్తుతానికి 15 ఏళ్ల నిబంధనే అమల్లో ఉంది.
రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే వారు ఈ కమ్యూటేషన్ సదుపాయాన్ని వాడుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అయితే ఇది తీసుకునే ముందు మీ నెలవారీ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications