EPFO: గుడ్ న్యూస్.. పీఎఫ్ కటింగ్ రూ.1800 లకే పరిమితం.. జీతం పెరుగుతుందా..!
ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) స్కీమ్ 2026ను నోటిఫై చేసింది. ఇది దాదాపు ఎనిమిది కోట్ల మంది యాక్టివ్ EPFO చందాదారులపై ప్రభావం చూపనుంది. ఉద్యోగుల తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్ (PF) వాటా నెలకు రూ.1,800 కు పరిమితం చేసింది. ఇది రూ.15,000 చట్టబద్ధమైన వేతన పరిమితిలో 12 శాతానికి సమానమని పేర్కొంది. ఉద్యోగి బేసిక్ శాలరీ ఎక్కువగా ఉన్నా, ఆ ఉద్యోగి ప్రమేయం లేకుండా రూ.1800 కంటే ఎక్కువ పీఎఫ్ కట్ చేసేందుకు వీలు లేదు. ఒక ఉద్యోగి నెలకు రూ.1 లక్ష మూల వేతనం సంపాదించినప్పటికీ తప్పనిసరి వాటా రూ.1,800 గానే ఉండనుంది. అయితే దీనికి మించిన ఏ మొత్తామైనా స్వచ్ఛంద కంట్రిబ్యూషన్ కిందికి వస్తుంది.
పదవీ విరమణ ప్రయోజనాలను తగ్గించకుండా ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలను సరళీకృతం చేసింది. గరిష్ట జీతాన్ని రూ.15,000 గాన ఉంచారు. యజమానులు రూ.15,000లో 12 శాతం మినహాయించాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెలా రూ.1,800 తప్పనిసరిగా చెల్లించాలి. పదవీ విరమణ కోసం మరింత పొదుపు చేయాలనుకునే ఉద్యోగులు, ఈ పరిమితికి మించి స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (VPF) ద్వారా తమ చెల్లింపులను కొనసాగించవచ్చని పీఎఫ్ పేర్కొంది. చట్టబద్ధమైన చెల్లింపులా కాకుండా, ఉద్యోగ ఒప్పందం లేదా కంపెనీ విధానంలో అటువంటి నిబద్ధత భాగంగా ఉంటే తప్ప, ఈ అదనపు స్వచ్ఛంద చెల్లింపులకు సమానమైన మొత్తాన్ని యజమానులు చట్టబద్ధంగా చెల్లించాల్సిన అవసరం లేదు.
{image-epfo1-94451783071579jpg telugu.goodreturns.in}
రూ.1800లకే పరిమితం చేసిన క్రమంలో ఇప్పటి వరకు ఎక్కువ పీఎఫ్ కట్ అయిన వారికి చేతికి వచ్చే జీతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే తమ పూర్తి బేసిక్ శాలరీపై 12 శాతం పీఎఫ్ కట్ చేయించుకుంటున్నారో వారికి రూ.1800 ఎంచుకుంటే పీఎఫ్ కటింగ్స్ తగ్గి వారి నెలవారీ టేక్ హోమ్ జీతం పెరగనుంది. స్వచ్ఛందంగా అధిక వాటాలను ఎంచుకుంటే తప్ప, వేతన పరిమితి కంటే చాలా ఎక్కువ సంపాదించే ఉద్యోగులు, యజమాని, ఉద్యోగి ఇద్దరి నుండి చట్టబద్ధంగా కేవలం రూ.1,800 మాత్రమే వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.15,000 లేదా అంతకంటే తక్కువ మూల వేతనం ఉన్న ఉద్యోగులకు ఎటువంటి మార్పు ఉండదు.
పీఎఫ్ సభ్యులు ఉద్యోగి, యజమాని కంట్రిబ్యూషన్లు రెండింటినీ కలుపుకొని, వారి అర్హత కలిగిన బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. నెలవారీ జీతం ఎక్కువగా తీసుకోవాలనుకునే వారు కంట్రిబ్యూషన్ ను రూ.1800 పరిమితం చేస్తే రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటుందని.


Click it and Unblock the Notifications