EPFO News: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగుల భద్రతకోసం నిర్థేశించబడిన ఈపీఎఫ్ చందదారులకు ట్రస్ట్ శుభవార్త ప్రకటించింది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించబడిన వడ్డీ రేట్లను ఇప్పుడు గమనిద్దాం.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా తన వడ్డీ రేట్లను ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులు దాచుకుంటున్న మెుత్తంపై 8.25 శాతం వడ్డీని చెల్లించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను పీటీఐ వార్తా సంస్థ శనివారం ప్రకటించింది.

మార్చి 2023లో ఈపీఎఫ్ఓ అంతకు ముందు ఉన్న వడ్డీ రేటు 8.10 శాతం నుంచి స్వల్పంగా 8.15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మార్చి 2022లో EPFO 2021-22కి పీఎఫ్ చందాదారులు దాచుకునే డబ్బుపై వడ్డీని 2020-21లో 8.5 శాతం నుంచి ఆరు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల కోసం నాలుగు దశాబ్దాల కనిష్ఠమైన 8.1 శాతానికి తగ్గించటం గతంలో చాలా మందిని నిరుత్సాహానికి గురిచేసింది. వాస్తవానికి 1977-78లో 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు తర్వాత అతి తక్కువ రేటు మోదీ ప్రభుత్వ హయాంలో ప్రకటించబడింది.
తాజా వడ్డీ రేట్లలో మార్పులను ప్రకటించిన 6 నెలల తర్వాత రానున్న కాలంలో 6 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ సొమ్ము జమకానుంది. మార్చి 2020లో EPFO ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19కి అందించిన 8.65 శాతం నుంచి 2019-20కి ఏడేళ్ల కనిష్ఠ స్థాయి 8.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications