పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఉపయోగించని (Inoperative Accounts) పీఎఫ్ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని రీఫండ్ చేయడంపై కేంద్ర కార్మిక శాఖ ఫోకస్ పెట్టింది. కాగా దేశ వ్యాప్తంగా 7.11 లక్షలకు పైగా ఖాతాలు వినియోగంలో లేకుండా ఉన్నాయి. ఈ ఖాతాల్లో సుమారుగా రూ. 30.52 కోట్లకు పైగా డబ్బు క్లెయిమ్ లేకుండా పడి ఉంది. ఈ అన్‌క్లెయిమ్డ్ నిధులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మొత్తాన్ని సదరు ఖాతాదారులు లేదా వారి లీగల్ వారసులకు త్వరలో బదిలీ చేయనున్నట్లు కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ ఖాతాలను సెటిల్ చేయాలని కార్మిక, ఉపాధి శాఖ ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఆధార్‌తో అనుసంధానమైన ఈపీఎఫ్ ఖాతాలున్న వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను తక్షణం బదిలీ చేయనున్నట్లుగా కేంద్రం తెలిపింది.

సాధారణంగా మూడు సంవత్సరాల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకపోయిన EPF ఖాతాలను ఇనాక్టివ్ అకౌంట్స్ గా పరిగణిస్తారు. ఉద్యోగం వదిలిన తర్వాత PF డబ్బును కొత్త ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయకపోవడం, ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ లేదా కుటుంబ సభ్యులు క్లెయిమ్ దాఖలు చేయకపోవడం వంటి కారణాలతో ఈ ఖాతాలు నిష్క్రియ స్థితిలోకి వెళ్తాయి.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. రూ. 1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఇనాక్టివ్ EPF ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేయనున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా సంబంధిత ఖాతాదారుల ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఇందుకోసం ఖాతాదారులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదా క్లెయిమ్ ఫారమ్ సమర్పించాల్సిన పని ఉండదు.
ఈ చర్య ద్వారా EPFO వ్యవస్థను శుభ్రపరచడం (క్లీనప్), నిష్క్రియ ఖాతాల సంఖ్యను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం EPFO వద్ద మొత్తం సుమారు 31 లక్షల ఇనాక్టివ్ ఖాతాలు ఉన్నట్లు అంచనా. తొలి దశలో చిన్న బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను సెటిల్ చేసి, తరువాత పెద్ద మొత్తాలున్న ఖాతాలపై కూడా దశలవారీగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో EPF ఖాతాలు ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకు ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రభుత్వం సూచనలు ఇస్తోంది.
EPF ఖాతాలు ఇనాక్టివ్ కాకుండా ప్రభుత్వ సూచనలు
ఉద్యోగంలో ఉన్న సమయంలో మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) యాక్టివ్‌గా ఉంచుకోవాలి;
ఉద్యోగం మారినప్పుడు పాత EPF ఖాతాలోని డబ్బును కొత్త ఖాతాకు తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్ చేయాలి.
ఆధార్, బ్యాంక్ ఖాతా వంటి KYC వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
ఈ నిర్ణయం EPFO 3.0 విజన్ లో భాగంగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. ఇది ఒక డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్. దీని లక్ష్యం క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించడం. ప్రస్తుతం 20 రోజుల వరకు పడుతున్న క్లెయిమ్ ప్రాసెస్‌ను భవిష్యత్తులో 3 రోజులకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మొదట చిన్న మొత్తాలున్న ఖాతాలను సెటిల్ చేయడం ద్వారా, ఖాతాదారుల డబ్బు వారికే చేరేలా చేయడమే కాకుండా EPFOపై ఉన్న పరిపాలనా భారం కూడా తగ్గనుంది. అలాగే, పెద్ద ఇనాక్టివ్ ఖాతాల డబ్బును కూడా గుర్తించి తిరిగి చెల్లించే విధానాలపై ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోంది.
మొత్తంగా చూసినట్లయితే EPFO ఇనాక్టివ్ ఖాతాలపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు పూర్తిగా అనుకూలమైనదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న మొత్తాల కోసం ప్రత్యేకంగా క్లెయిమ్ చేయలేక నష్టపోతున్న వారికి ఈ చర్య పెద్ద ఉపశమనం కలిగించనుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications