EPFO: మార్చిలో నికర ప్రాతిపదికన 13.40 లక్షల మంది సభ్యులు చేరినట్లు రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO ప్రకటించింది. వీరిలో సుమారు 7.8 లక్షల మంది మొదటిసారిగా EPFO పరిధిలోనికి వచ్చినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన పేరోల్ డేటా ప్రకారం.. 2021-22లో నికర ప్రాతిపదికన మొత్తం 1.22 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. 2022-23లో వీరి సంఖ్య 1.39 కోట్లకు వెళ్లింది.
"గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే 2022-23లో 1.39 కోట్ల మంది EPFOలో చేరారు. అంటే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 13.22 శాతం పెరుగుదల నమోదైంది. కొత్తగా చేరిన సభ్యులలో అత్యధికంగా 18-21 సంవత్సరాల వయస్సు ఉన్నవారే ఉన్నారు. ఈ విభాగానికి చెందిన వారి సంఖ్య 2.35 లక్షలు. 22-25 ఏళ్లు గలవారు 1.94 లక్షల మంది సభ్యులు. ఇక 18-25 సంవత్సరాల వారిని పరిగణలోనికి తీసుకుంటే మొత్తం కొత్త వారిలో ఏకంగా 56.60 శాతం" అని కార్మిక శాఖ వెల్లడించింది.

దేశంలోని వ్యవస్థీకృత రంగం వర్క్ ఫోర్స్ లో చేరిన మెజారిటీ సభ్యులు మొదటిసారి ఉద్యోగం సాధించినవారేనని డేటా సూచిస్తోంది. వీరితో పాటు దాదాపు 10.09 లక్షల మంది EPFOలో తిరిగి చేరారని గణాంకాలు చెబుతున్నాయి. వీరు తమ ఉద్యోగాలను మార్చుకుని, తిరిగి EPFO కింద రిజిస్టర్ కాబడిన మరో కంపెనీలో తిరిగి చేరారు. వారు తుది సెటిల్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా PF బ్యాలెన్స్ ను బదిలీ చేయాలని ఎంచుకున్నారు.
లింగం వారీగా విశ్లేషణను చూస్తే మార్చి 2023లో నికర మహిళా సభ్యుల నమోదు 2.57 లక్షలుగా ఉంది. అంటే సభ్యుల చేరికలో దాదాపు 19.21 శాతం వీరి వాటా. అందులోనూ 1.91 లక్షల మంది మహిళలు కొత్తగా EPFO కిందకు వచ్చినవారు. హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాల్లో నెలవారీగా కొత్త వారి జాయినింగ్ ట్రెండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర 20.63 శాతం నికర చేరికలతో ముందంజలో ఉండగా, తమిళనాడు 10.83 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications