Provident Fund: ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా కొనసాగుతున్న ఈపీఎఫ్‌వో.. ఉద్యోగుల భవిష్యనిధి సహా పెన్షన్ ఫండ్‌ను మేనేజ్ చేస్తూ ఉంటుంది. తన వెబ్‌సైట్ ద్వారా చందాదారులకు అవసరమైన సేవలను అందిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నిబంధనలు సహా వడ్డీరేట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటుంది.
తాజాగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సైట్ సేవలకు అంతరాయం కలిగింది. ఆధార్ ద్వారా ధ్రువీకరణ సేవలు అందుబాటులో లేవంటూ ఎర్రర్ చూపిస్తోంది. దీంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇది గమనించిన పలువురు యూజర్లు EPFOని ట్యాగ్ చేసి విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా నియంత్రణ సంస్థకు తెలియజేస్తున్నారు.

ఈ వ్యవహారంపై EPFO స్పందించింది. ఆధార్ అథెంటికేషన్‌కు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అంగీకరించింది. అసలు ఇబ్బందిని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. టెక్నికల్ మెయింటెనెన్స్ కారణాల వల్ల ఆధార్ అథెంటికేషన్ సేవలకు అంతారయం కలిగిందని చెప్పుకొచ్చింది. ఇందుకు తాము చింతిస్తున్నట్లు తెలుపుతూ పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే మూడింట ఓ వంతు క్లెయిమ్స్‌ను EPFO తిరస్కరిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో జాప్యంపైనా Xలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. క్లెయిమ్ పరిష్కారం సహా PF మొత్తాన్ని విడుదల చేయడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుందని, సభ్యులు ఈ విషయంలో సహకరించాలని కోరింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications