EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! త్వరలోనే ఏటీయం నుంచి విత్ డ్రా! ముహుర్తం ఫిక్స్ అయినట్టేనా?
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కొత్త సంవత్సరం వేళ ఒక అదిరిపోయే వార్త వినిపించబోతోంది. తమ కష్టార్జితమైన పీఎఫ్ (PF) సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ఏటీఎం కార్డు లేదా యూపీఐ (UPI) ద్వారా క్షణాల్లో డబ్బు పొందే సరికొత్త వ్యవస్థను EPFO 3.0 పేరుతో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

EPFO 3.0 అంటే..
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన డిజిటల్ వ్యవస్థను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా ప్రవేశపెడుతున్నదే 'EPFO 3.0'. ఈ కొత్త వ్యవస్థ ద్వారా సుమారు 7 కోట్ల మంది చందాదారులకు బ్యాంక్ సేవల తరహాలో వేగవంతమైన సేవలు అందనున్నాయి. గతంలో పీఎఫ్ విత్‌డ్రా కోసం ఫారమ్‌లు నింపడం, యజమాని ఆమోదం కోసం వేచి చూడటం వంటి తలనొప్పులు ఉండేవి. కానీ, ఇకపై అంతా ఆటోమేటెడ్ డిజిటల్ ప్రక్రియ ద్వారా జరగనుంది.
ఏటీఎం నుంచి విత్ డ్రా..
ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది ఏటీఎం (ATM) సదుపాయం. మనం బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా డ్రా చేస్తామో.. అదే విధంగా పీఎఫ్ ఖాతా నుంచి కూడా నేరుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం రాబోతోంది. అత్యవసర సమయాల్లో నిమిషాల వ్యవధిలోనే నిధులను పొందే వెసులుబాటు కల్పించడంతో పాటు UPI ట్రాన్సాక్షన్స్ ను కూడా అనుమతిస్తుంది.
నిబంధనల్లో కీలక మార్పులు
EPFO 3.0లో భాగంగా పాక్షిక ఉపసంహరణ (Partial Withdrawal) నియమాలను సరళతరం చేశారు. గతంలో ఉన్న 13 కేటగిరీలను కేవలం 3 ప్రధాన కేటగిరీలకు తగ్గించారు. అవేంటంటే..
- అత్యవసర అవసరాలు: అనారోగ్యం, చదువు లేదా వివాహం. (చదువు కోసం 10 రెట్లు, పెళ్లి కోసం 5 రెట్లు ఎక్కువ విత్‌డ్రా చేసుకునే ఛాన్స్).
- గృహ అవసరాలు: ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం.
- ప్రత్యేక పరిస్థితులు: వీటితోపాటు మరేవైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే విత్ డ్రా చేసుకోవచ్చు.
అయితే.. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం, ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో కనీసం 25% సొమ్మును అలాగే ఉంచాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు 8.25% వార్షిక వడ్డీ యథావిధిగా అందుతుంది.
ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు
- వేగవంతమైన క్లెయిమ్స్: మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన క్లెయిమ్స్ చాలా వేగంగా ప్రాసెస్ అవుతాయి.
- సులభమైన బదిలీ: ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ బదిలీ కోసం తిరగాల్సిన పనిలేదు. పాత ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి లింక్ అవుతుంది.
- రియల్ టైమ్ ట్రాకింగ్: మీ క్లెయిమ్ ఏ స్టేజ్‌లో ఉందో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ముహుర్తం ఎప్పుడు?
నిజానికి ఈ ప్రాజెక్ట్ 2025 జూన్‌లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సాంకేతిక పరీక్షల (Trial Runs) కారణంగా ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం, 2026 కొత్త సంవత్సరం కానుకగా జనవరిలో ఈ సేవలను ప్రారంభించేందుకు EPFO కసరత్తు చేస్తోంది. ఈ సేవలను పొందాలనుకునే వారు తమ KYC (ఆధార్, బ్యాంక్ అకౌంట్, UAN) వివరాలను అప్‌డేట్ చేసి ఉంచుకోవడం తప్పనిసరి.


Click it and Unblock the Notifications