EPFO 3.0 అప్‌డేట్! ఇకపై ATM, UPI ద్వారా PF విత్‌డ్రా చేసుకునే ఫీచర్! ఆ రోజే లాంచ్!

కోట్లాది మంది ఉద్యోగులకు శుభవార్త! పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఇకపై బ్యాంక్ నుంచి నగదు తీయడం అంత సులభం కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన డిజిటల్ వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో 'EPFO 3.0'ను వేగంగా అమలు చేస్తోంది. దీని ద్వారా సబ్‌స్క్రైబర్లు ఏటీఎం , యూపీఐ (UPI) ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులను పొందే వెసులుబాటు కలగనుంది.

EPFO 3 0 Update PF Withdrawal via ATM UPI Expected Launch Date UAN KYC Rules Latest News

ఏటీఎం, యూపీఐ ద్వారా ఎంత విత్‌డ్రా చేయొచ్చు?

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, పీఎఫ్ విత్‌డ్రా కావాలంటే చాలా రోజుల సమయం పట్టేది. కానీ EPFO 3.0 లో భాగంగా వచ్చే ఈ కొత్త ఫీచర్‌తో పీఎఫ్ ఖాతాదారులు తమ మొత్తం బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా మారుతుంది.

ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?

నివేదికల ప్రకారం, సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ ఏటీఎం కార్డులను జారీ చేయాలని ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ యోచిస్తోంది. ఇవి నేరుగా సభ్యుల పీఎఫ్ ఖాతాలకు లింక్ చేయబడతాయి. యూపీఐ విషయానికి వస్తే, మీ యూఏఎన్ (UAN) కు అనుసంధానించబడిన బ్యాంక్ అకౌంట్ ద్వారా తక్షణమే విత్‌డ్రా చేసుకునేలా సాఫ్ట్‌వేర్ మార్పులు చేస్తున్నారు. దీని వల్ల సుదీర్ఘమైన పేపర్ వర్క్ , ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది. మే నెలాఖరు నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది

అర్హతలు ఏమిటి?

ఏటీఎం లేదా యూపీఐ ద్వారా డబ్బులు తీయాలంటే సభ్యులకు కచ్చితంగా యాక్టివ్ యూఏఎన్ ఉండాలి. అంతేకాకుండా, కేవైసీ (KYC) డాక్యుమెంట్లను సమర్పించి ఉండాలి. ముఖ్యంగా పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు , ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వంటి వివరాలు మీ పీఎఫ్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి.

రికార్డు స్థాయిలో క్లెయిమ్ల పరిష్కారం

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 సంవత్సరంలో EPFO ఏకంగా 8.31 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇందులో 71 శాతానికి పైగా అడ్వాన్స్ క్లెయిమ్‌లను కేవలం మూడు రోజుల్లోనే ఆటో-మోడ్ ద్వారా పరిష్కరించడం విశేషం.

ముఖ్యంగా, 6.68 కోట్ల మంది సభ్యులు చెక్ లీఫ్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే క్లెయిమ్‌లను ఫైల్ చేశారు. అలాగే, 1.59 కోట్ల మంది సభ్యులు తమ యజమాని (Employer) ప్రమేయం లేకుండానే బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేసుకోగలిగారు. ఈ మార్పులన్నీ పీఎఫ్ సబ్‌స్క్రైబర్‌ల జీవితాలను మరింత సులభతరం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో EPFO 3.0 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పీఎఫ్ అనేది ఒక సేవింగ్స్ అకౌంట్ లాగే చాలా సౌకర్యవంతంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+