EPFO 3.0: ఎటీఎం ద్వారా నేరుగా డబ్బులు విత్ డ్రా.. కొత్తగా రానున్న ఈ 5 బెనిఫిట్స్‌తో మీ పని చాలా ఈజీ ఇక..
భారతదేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ముఖ్యమైన భద్రతా వనరుగా నిలుస్తోంది. ఉద్యోగ జీవితంలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ (PF) రూపంలో పొదుపు చేస్తారు. ఈ నిధి ఉద్యోగం విరమణ తర్వాత లేదా అత్యవసర సమయాల్లో వారికి ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. ఇప్పుడు, కాలానికి అనుగుణంగా, EPFO కూడా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వైపు పెద్ద అడుగు వేసింది. త్వరలో ప్రారంభం కానున్న EPFO 3.0 ప్లాట్‌ఫామ్.. ఈ దిశలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని భావిస్తున్నారు.
EPFO 3.0లో ఉద్యోగులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సౌకర్యం ATM ద్వారా నేరుగా PF డబ్బు తీసుకోవడం. ఇప్పటి వరకు PF ఉపసంహరణ కోసం ఆన్‌లైన్ లేదా కార్యాలయానికి వెళ్లే ప్రక్రియను పాటించాల్సి వచ్చేది. అయితే ఇకపై ఏటీఎం కార్డు ఉపయోగించి డబ్బును సులభంగా డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికి UAN (Universal Account Number) యాక్టివేషన్ తప్పనిసరి. అంతేకాకుండా, ఆధార్ కార్డును తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానించాలి. దీనితో పాటు, UPI ఆధారిత ఉపసంహరణ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. మన దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, UPI ద్వారా PF ఉపసంహరణ ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో తక్షణ సహాయం చేస్తుంది.

ఇంతవరకు PF ఖాతాలో చిన్న చిన్న తప్పులను సరిచేయాలంటే EPFO కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై EPFO 3.0లో OTP ధృవీకరణతో ఆన్‌లైన్‌లోనే మార్పులు చేయగలరు. పేరు సవరణలు, ఖాతా వివరాల అప్‌డేట్‌లు చాలా వేగంగా పూర్తి అవుతాయి. క్లెయిమ్ స్థితి కూడా మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఎప్పుడైనా ట్రాక్ చేసుకోవచ్చు. దీని వలన ప్రక్రియలో ఆలస్యం తగ్గిపోతుంది. ఉద్యోగులకు పారదర్శకమైన అనుభవం లభిస్తుంది.
ఉద్యోగి మరణించిన సందర్భంలో, కుటుంబ సభ్యులు PF నిధి పొందడానికి ఎక్కువ పేపర్‌వర్క్ చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా, మైనర్ వారసుల కోసం గార్డియన్ సర్టిఫికేట్ తప్పనిసరి. కానీ EPFO 3.0లో ఇది తొలగించారు. ఇకపై కుటుంబానికి త్వరిత ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఉద్యోగుల కుటుంబాలకు చాలా ఉపశమనాన్ని ఇవ్వనుంది. కొత్తగా రానున్న ఈఫీఎఫ్ఓ 3.0లో ఉద్యోగులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ ఖాతా బ్యాలెన్స్, డిపాజిట్‌లు, క్లెయిమ్‌లు అన్నీ సులభంగా చెక్ చేసుకోవచ్చు.
ఇన్ఫోసిస్, విప్రో, TCS వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఎంపిక చేశారు. మొదట 2025 జూన్‌లో విడుదల కావాల్సిన ఈ సిస్టమ్, సాంకేతిక పరీక్షల కారణంగా కొంత ఆలస్యమైంది. కానీ పూర్తిస్థాయి సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications