ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. తాజాగా తన వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ EPFO 3.0ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రాల్, పెన్షన్, అడ్వాన్స్ క్లెయిమ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే, రిటైర్మెంట్ నిధిని కాపాడేందుకు కొన్ని కఠిన నిబంధనలను కూడా జోడించారు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
1. నిరుద్యోగ సమయంలో ఉపసంహరణ (Unemployment Withdrawal)
ఉద్యోగం కోల్పోయినప్పుడు గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఒక నెల తర్వాత 75%, రెండు నెలల తర్వాత మిగిలిన 25% విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ EPFO 3.0 లో.. కొత్త రూల్ ఏంటంటే.. ఉద్యోగం పోయిన వెంటనే 75% నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే పూర్తి 100% నిధులు కావాలంటే మాత్రం కనీసం 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉండాల్సిందే.

2. పెన్షన్ విత్‌డ్రా (EPS Withdrawal) పై కొత్త కండిషన్
చాలా మంది ఉద్యోగం మారినప్పుడు లేదా మానేసినప్పుడు పెన్షన్ డబ్బును వెంటనే విత్‌డ్రా చేస్తుంటారు. దీనిపై EPFO ఇప్పుడు ఆంక్షలు పెంచింది. పాత రూల్ ప్రకారం 2 నెలల నిరుద్యోగ కాలం తర్వాత పెన్షన్ డ్రా చేయవచ్చు. కానీ, ఇప్పుడు పెన్షన్ ఫండ్‌ను విత్‌డ్రా చేయాలంటే 36 నెలల (3 ఏళ్లు) నిరుద్యోగ కాలం తప్పనిసరి. ఇది మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచేందుకేనని అధికారులు చెబుతున్నారు.
3. వివాహం, ఉన్నత చదువుల కోసం (Education & Marriage)
చందాదారులకు అత్యవసరంగా డబ్బు అవసరమయ్యే పెళ్లిళ్లు, పిల్లల చదువుల విషయంలో EPFO 3.0 వెసులుబాటు కల్పించింది. పెళ్లి కోసం గతంలో 2 సార్లు మాత్రమే అనుమతి ఉండగా ఇప్పుడు సర్వీసు కాలంలో 5 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కోసం.. గతంలో 3 సార్లు అనుమతి ఉండగా ఇప్పుడు ఏకంగా 10 సార్లు పార్షియల్ విత్‌డ్రాకు అవకాశం ఇచ్చారు. దీనికోసం కనీసం 7 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి.
4. లాకౌట్ లేదా కంపెనీ మూసివేత సమయంలో
ఏదైనా కారణం చేత కంపెనీ మూతపడితే (Lockout).. గతంలో 100% వరకు విత్‌డ్రా చేసుకునే వీలుండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం మీరు 75% నిధులను మాత్రమే విత్‌డ్రా చేసుకోగలరు. మిగిలిన 25% మొత్తాన్ని తప్పనిసరిగా కనీస నిల్వగా (Mandatory Minimum Balance) ఖాతాలోనే ఉంచాలి. ఇది భవిష్యత్తులో మీకు వడ్డీ ఆదాయాన్ని మరియు ఆర్థిక భద్రతను ఇస్తుంది.
5. ఇళ్ల నిర్మాణం/కొనుగోలు (House Purchase)
సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రక్రియను మరింత సులభతరం చేశారు. అర్హత, పరిమితులు పాత పద్ధతిలోనే ఉన్నప్పటికీ ఇప్పుడు పేపర్ వర్క్ తగ్గించి ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ దిశగా అడుగులు వేశారు. ఇప్పుడు అంతా డిజిటల్ రిక్వెస్ట్ ద్వారా త్వరితగతిన పూర్తవుతుంది.
ఇవి మీకు లాభమా? నష్టమా?
మొత్తంగా చూస్తే EPFO 3.0 అనేది ఒక వైపు నిధుల లభ్యతను పెంచుతూనే (పెళ్లి, చదువుల కోసం), మరోవైపు బాధ్యతాయుతమైన పొదుపును ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఏటీఎం/యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే టెక్నాలజీ చందాదారులకు చాలా కాలం పాటు వేచి చూడాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అయితే, పెన్షన్, ఫుల్ విత్‌డ్రా విషయంలో పెరిగిన వెయిటింగ్ పీరియడ్‌ను దృష్టిలో ఉంచుకుని మీ ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడం అవసరం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications