పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా? పెళ్లి, ఇల్లు, చదువుకు ఎంత వస్తుందో తెలుసా?

సాధారణంగా ఉద్యోగులు పీఎఫ్ (EPF) అకౌంట్‌ను రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెద్ద నిధిగా చూస్తుంటారు. కానీ జీవితంలో అనుకోకుండా వచ్చే పెద్ద పెద్ద ఖర్చుల కోసం రిటైర్మెంట్‌కు ముందే ఈ డబ్బును వాడుకునే వెసులుబాటును EPFO కల్పిస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు కొనడం లేదా హోమ్ లోన్ కట్టడం వంటి అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుండి 'అడ్వాన్స్' రూపంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

అయితే, దీనికి కొన్ని ప్రత్యేక నిబంధనలు, సర్వీస్ కాల పరిమితులు ఉన్నాయి. ఏ అవసరానికి ఎంత డబ్బు వస్తుంది? ఎవరెవరు అర్హులు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

EPF Withdrawal Limits 2026 Rules Marriage Education Home Purchase EPFO

1. పిల్లల చదువుల కోసం (Education)

మీ పిల్లల (కొడుకు లేదా కూతురు) టెన్త్ క్లాస్ తర్వాత పైచదువుల కోసం పీఎఫ్ డబ్బులు వాడుకోవచ్చు.

  • అర్హత: EPFO లో కనీసం 7 సంవత్సరాల మెంబర్‌షిప్ (సర్వీస్) పూర్తి కావాలి.
  • ఎంత వస్తుంది: ఉద్యోగి తన సొంత షేర్ కాంట్రిబ్యూషన్ (వడ్డీతో కలిపి) లో గరిష్టంగా 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

2. పెళ్లి ఖర్చుల కోసం (Marriage)

మీ సొంత పెళ్లికి గానీ, లేదా మీ కొడుకు, కూతురు, తమ్ముడు, చెల్లెలి పెళ్లి ఖర్చుల కోసం ఈ అడ్వాన్స్ వాడుకోవచ్చు.

  • అర్హత: దీనికి కూడా కనీసం 7 ఏళ్ల సర్వీస్ ఉండాలి.
  • ఎంత వస్తుంది: మీ సొంత కాంట్రిబ్యూషన్ , వడ్డీ మొత్తంలో 50% వరకు వస్తుంది. జీవితకాలంలో ఇలా గరిష్టంగా 3 సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

3. ఖాళీ స్థలం (Plot) కొనడానికి

ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ ప్లాట్ కొనాలనుకుంటే పీఎఫ్ నుండి డబ్బులు తీసుకోవచ్చు.

  • అర్హత: కనీసం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి కావాలి.
  • ఎంత వస్తుంది: మీ 24 నెలల బేసిక్ శాలరీ + డీఏ (DA), లేదా పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న మొత్తం బ్యాలెన్స్, లేదా ఆ స్థలం ఖరీదు.. ఈ మూడింటిలో ఏది తక్కువైతే అంత అమౌంట్ వస్తుంది. (స్థలం మీ పేరిట గానీ, భార్య/భర్త పేరిట గానీ, లేదా ఇద్దరి జాయింట్ పేరిట గానీ ఉండాలి).

4. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు , నిర్మాణానికి..

EPFO నియమాల ప్రకారం పీఎఫ్ ఖాతాలో కనీసం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు, తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి అడ్వాన్స్ పొందవచ్చు; దీని కింద 36 నెలల బేసిక్ జీతం + డీఏ (DA), లేదా మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్, లేదా ఇంటి ఖరీదు/నిర్మాణ వ్యయం.. ఈ మూడింటిలో ఏది తక్కువైతే అంత గరిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది.

5. హోమ్ లోన్ కట్టడానికి (Home Loan Repayment)

మీరు అప్పటికే హోమ్ లోన్ తీసుకుని ఉంటే, ఆ లోన్ తీర్చడానికి కూడా పీఎఫ్ డబ్బులు వాడుకోవచ్చు.
దీనికోసం కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుండాలి. 36 నెలల బేసిక్ శాలరీ + డీఏ, లేదా మీ అకౌంట్‌లో ఉన్న మొత్తం సొమ్ము, లేదా మీరు కట్టాల్సిన బాకీ (Outstanding Loan).. ఈ మూడింటిలో ఏది తక్కువైతే అంత డబ్బును లోన్ క్లియర్ చేయడానికి ఇస్తారు.

ముఖ్యమైన విషయం: పీఎఫ్ అకౌంట్ నుండి తీసుకునే ఈ అడ్వాన్స్ డబ్బులను మీరు మళ్లీ తిరిగి ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేదు (Non-refundable). కానీ, ఇలా ముందే డబ్బులు డ్రా చేయడం వల్ల రిటైర్మెంట్ నాటికి మీ చేతికి వచ్చే పెద్ద మొత్తం తగ్గిపోతుందని గుర్తుంచుకోండి. చాలా అత్యవసరమైతేనే ఈ ఆప్షన్ వాడుకోవడం మంచిది!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+