For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు, కంపెనీలకు EPF మద్దతు పొడిగింపు, PLI స్కీం కూడా ఏడాది పొడిగింపు

|

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద ఉద్యోగులకు, కంపెనీలకు ఈపీఎప్ మద్దతును మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా సెకండ్ వేవ్ తదనంతర ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఈపీఎఫ్ మద్దతు స్కీంను పొడిగించారు. దీనిని అక్టోబర్ 2020లో ప్రకటించారు.

నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ, మరిన్ని కథనాలు

కరోనా నేపథ్యంలో గత ఏడాది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభించగా, ఇందుకు రూ.1,33,972 లక్షల కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. రూ.93,869 కోట్ల భారం పడిందన్నరు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నవంబర్ 2021 వరకు ఈ పథకాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు.

EPF support extended till March 31, PLI scheme extended by one year

లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్‌కు పీఎల్ఐ స్కీంను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీనిని 2025-26 వరకు పొడిగించారు. ఈ పథకం కింద మ్యానుఫ్యాక్చరర్స్‌కు 6 శాతం నుండి 4 శాతం వరకు ఇంక్రిమెంటల్ ఉంటుంది. కేంద్ర కేబినెట్ 2020 నవంబర్ నెలలో 10 రంగాలకు పీఎల్ఐ స్కీంను వర్తింప చేస్తూ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019లో 10.93 మిలియన్ల మంది విదేశీయులు భారత్‌కు వచ్చారు. వీరు మన దేశంలో 30.098 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు.

English summary

ఉద్యోగులకు, కంపెనీలకు EPF మద్దతు పొడిగింపు, PLI స్కీం కూడా ఏడాది పొడిగింపు | EPF support extended till March 31, PLI scheme extended by one year

EPF support to employers and employees under Aatmanirbhar Bharat Rozgar Yojana has been extended till March 31, 2022.The scheme was first rolled out in October 2020.
Story first published: Monday, June 28, 2021, 16:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X