మీకు పీఎఫ్ ఖాతా ఉంటే ఉచితంగా రూ.7 లక్షలు.. ఈ ఆఫర్ గురించి ప్రతి ఒక్క ఉద్యోగి తెలుసుకోవాలి..
భారతదేశంలో చాలా మంది ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ PF (Provident Fund) ఖాతాలో ప్రతి నెలా డబ్బు జమ చేస్తున్నారు. చాలామంది PF అంటే పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు లేదా పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించినదిగా మాత్రమే భావిస్తుంటారు. కానీ EPFO (Employees' Provident Fund Organisation) PF సభ్యులకు అందించే ఒక ముఖ్యమైన ప్రయోజనం గురించి చాలామందికి తెలియదు. అది ఉచిత జీవిత బీమా కవరేజ్. EPFO అందించే ఈ బీమా విలువ రూ.7 లక్షలు వరకు ఉంటుంది. దీనిని పొందడానికి ఉద్యోగి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం జరగదు.
ఈ ఉచిత బీమా EDLI (Employees' Deposit Linked Insurance Scheme) కింద అందించబడుతుంది. ఎవరైతే EPF ఖాతాలో కాంట్రిబ్యూషన్ చేస్తారో వారు ఆటోమేటిక్‌గా ఈ బీమా కవర్లోకి వస్తారు. అంటే మీరు EPF సభ్యుడైతే.. మీరు ఇప్పటికే బీమా పొందినట్లే. దీనికి ప్రత్యేకంగా ఫారమ్ పూరించాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. EDLI పథకం EPS, EPF తర్వాత EPFO అందించే అత్యంత విలువైన ప్రయోజనాల్లో ఒకటి.

ఉద్యోగి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ బీమా అందించబడటం ఈ పథకం యొక్క ప్రధాన ప్రత్యేకత. ప్రీమియం మొత్తాన్ని ఉద్యోగి కాకుండా కంపెనీ చెల్లిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి మొత్తం జీతం (బేసిక్ + డియర్నెస్ అలవెన్స్) లో 0.5 శాతం EDLI పథకానికి కేటాయించబడుతుంది. ఈ మొత్తం ఉద్యోగి జీతం నుండి తగ్గించబడదు. కంపెనీ వేరుగా చెల్లిస్తుంది. దీంతో ప్రతి PF సభ్యుడు అదనపు ఖర్చు లేకుండా జీవిత బీమాను పొందగలుగుతాడు.
ఈ బీమా ప్రయోజనం ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే లభిస్తుంది. మరణం ఆఫీసులో జరిగినా, ఇంట్లో జరిగినా, ప్రయాణంలో జరిగినా లేదా సెలవుల్లో జరిగినా..ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నంతకాలం ఈ బీమా వర్తిస్తుంది. అలాంటి దురదృష్టకర సమయాల్లో ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా PF నామినీ ఈ బీమా మొత్తాన్ని పొందగలరు. ఇది కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది.
EDLI బీమా మొత్తాన్ని నిర్ణయించడంలో ఉద్యోగి చివరి 12 నెలల జీతం, PF కన్స్రిబ్యూషన్ కీలకంగా పనిచేస్తాయి. అందువలన ఉద్యోగి జీతం ఎక్కువగా ఉంటే, PF బ్యాలెన్స్ కూడా ఎక్కువగా ఉంటే, బీమా కవర్ కూడా గరిష్టంగా లభిస్తుంది. ఈ పథకం కింద కనీస బీమా కవర్ రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ. 7 లక్షలు అందించబడుతుంది.
చాలామంది PF ఖాతా ఉందని తెలిసినా, ఈ బీమా ప్రయోజనం ఉందని తెలియదు. ఉచితంగా లభించే ఈ ప్రయోజనం ఉద్యోగి, కుటుంబానికి అత్యవసర సమయాల్లో పెద్ద సహాయంగా ఉంటుంది. PF నామినేషన్ సరిగా ఉండటం చాలా ముఖ్యం. నామినీ వివరాలు EPFO పోర్టల్‌లో అప్‌డేట్ చేసి ఉంటే బీమా క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభమవుతుంది. EPF ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ EDLI ఒక ముఖ్యమైన భద్రత. ఎటువంటి ఖర్చు లేకుండా రూ. 7 లక్షల వరకు లభించే ఈ బీమా, ఉద్యోగి కుటుంబానికి జీవిత భద్రతను అందించే విలువైన ప్రయోజనంగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications