ePassport:ఇక ప్రయాణాలు సూపర్ ఫాస్ట్! ఇండియాలో 'ఇ-పాస్‌పోర్ట్' వచ్చేసింది.. ఎలా అప్లై చేయాలంటే..
మీరు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్! భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ విషయంలో కీలక మార్పులు చేస్తూ ఇ-పాస్ పోర్ట్ (ePassport) సేవలను అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు మనం వాడుతున్న సాధారణ పేపర్ పాస్‌పోర్ట్‌ల స్థానంలో.. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ కొత్త పాస్‌పోర్ట్‌లు ఇకపై మన ప్రయాణాలను మరింత సురక్షితం చేయనున్నాయి. అసలు ఈ ఇ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? దీని వల్ల మనకు కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

అసలు ఏంటి ఈ ePassport?
చూడటానికి ఇది మన పాత పాస్‌పోర్ట్ లాగే ఉంటుంది. కానీ దీని వెనుక అట్టలో ఒక చిన్న ఎలక్ట్రానిక్ చిప్ అమర్చబడి ఉంటుంది. ఈ చిప్‌లో మీ పేరు, ఫోటో, వేలిముద్రలు (Fingerprints), ఫేస్ రికగ్నిషన్ వంటి కీలక సమాచారం మొత్తం ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. అంటే ఎవరైనా మీ పాస్‌పోర్ట్‌ను ఫోర్జరీ చేయాలన్నా లేదా మీ డేటాను దొంగిలించాలన్నా అస్సలు సాధ్యం కాదు.
ఎవరు అప్లై చేసుకోవచ్చు?
భారత పౌరులందరూ ఈ ePassport కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు మొదటిసారి పాస్‌పోర్ట్ తీసుకుంటున్నా లేదా లేదా మీ పాత పాస్‌పోర్ట్ గడువు ముగిసి రిన్యూవల్ (Renewal) చేయించుకుంటున్నా.. మీరు ఈ కొత్త వెర్షన్ పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.
అప్లై చేసే విధానం (How to Apply)
దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పాత పద్ధతిలోనే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అధికారిక Passport Seva పోర్టల్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి, మీకు దగ్గరలోని PSK లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.
- నిర్ణీత సమయానికి వెళ్లి మీ బయోమెట్రిక్ వివరాలు అందిస్తే సరిపోతుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక చిప్ ఉన్న ఈ-పాస్‌పోర్ట్ మీ ఇంటికి వస్తుంది.
ఫీజు వివరాలు..
సాధారణ పాస్‌పోర్ట్ ఫీజులే దీనికి కూడా వర్తిస్తాయి..
- 36 పేజీల బుక్‌లెట్ కోసం: రూ. 1,500
- 60 పేజీల బుక్‌లెట్ కోసం: రూ. 2,000 (తత్కాల్ సేవలకు అదనపు ఛార్జీలు ఉంటాయి).
ఈ-పాస్‌పోర్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు..
- వేగవంతమైన ఇమ్మిగ్రేషన్: విదేశీ విమానాశ్రయాల్లో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. ఆటోమేటెడ్ గేట్ల ద్వారా మీ వివరాలు క్షణాల్లో స్కాన్ అవుతాయి.
- అత్యున్నత భద్రత: ఈ చిప్‌లోని డేటాను ట్యాంపర్ చేయడం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా చిప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే పాస్‌పోర్ట్ పనిచేయకుండా పోతుంది.
- గ్లోబల్ స్టాండర్డ్స్: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ పాస్‌పోర్ట్ విలువ మరింత పెరుగుతుంది.
మొత్తంగా డిజిటల్ ఇండియా దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ఒక వరం లాంటిది. మీరు కూడా విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉంటే వెంటనే మీ కొత్త ePassport కోసం అప్లై చేసుకోండి!


Click it and Unblock the Notifications