Business Ideas: ఆధునిక కోళ్ల ఫారాలతో లక్షల్లో లాభం.. సొంత ఊళ్లోనే ఆదాయం..
Poultry Business: మారిన కాలంతో పాటే మనుషులు మారుతున్నారు. నగరాల్లో జీవిచటం ఇష్టం లేని వారు తమ సొంత గ్రామాల్లో, ప్రాంతాల్లో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని చూస్తుంటారు. అలాంటి వారికి ఈసీ కోళ్ల ఫారాలు సరైన వ్యాపార ఆలోచన అని చెప్పుకోవచ్చు.
బాయిలర్ కోళ్ల పెంపకంలో ఈసీ ఫారమ్ సాంకేతికత వాడటం విసృతి చెందుతోంది. గతంలో సాంప్రదాయ పద్ధతులను అవలంభించి చాలా మంది రైతులు నష్టాలను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే వాతావరణ నియంత్రిత నూతన రకం షెడ్లలో కోళ్ల పెంపకం వల్ల వ్యాధులు, మరణాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. లోపల ఎల్లప్పుడూ టెంపరేచర్ స్థిరంగా ఉంచటం వల్ల కోళ్లు తగు మోతాదులో ఆహారం, నీరు తీసుకుని సకాలంలో బరువు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే లేయర్ కోళ్ల విషయానికి వస్తే పాతకాలంలో వాడే ఓపెన్ షెర్ల వల్ల అధిక వేడిమికి తక్కువ సంఖ్యలో గుడ్లు పెడతాయి. పైగా వేసవిలో వడదెబ్బ తగిలి మోట్టాలిటీ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అందువల్ల నియంత్రిత వాతావరణంలో కోళ్లు మంచిగా పెరుగుతాయని తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల రైతులు ప్రస్తుతం వీటి ఏర్పాటుపై మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే ఏపీ తెలంగాణలో కొందరు వీటిని ఏర్పాటు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ప్రారంభంలో వీటి నిర్మాణానికి రూ.కోటికి పైనే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే సొంత భూమి ఉన్న రైతులకు బ్యాంకులు 80 శాతం వరకు రుణాన్ని అందిస్తున్నాయి.
ఇలా ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్ వాతావరణంలో అధిక సంఖ్యలో కోళ్లను పెంచవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా ఆటోమేటెడ్ షేర్లలో 25 వేల పిల్లల వరకు పెంచేందుకు వీలు ఉంటుందని.. పైగా సకాలంలో కోళ్ల అవసరాలకు తగినట్లుగా నీళ్లు, ఆహారం సెన్సార్లు అందేలా చూస్తాయని తెలుస్తోంది. అందువల్ల చక్కగా పెరిగి బాయిలర్ కోళ్లు 40 రోజుల లోపే తగిన బరువుకు చేరుకుంటాయని దీనివల్ల రైతుకు లాభం అందుతుందని వారు అంటున్నారు. అలాగే ఏడాదికి ఎక్కువ బ్యాచ్ లను ఉత్పత్తి చేయెుచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications