హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి దేశంలో పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతోన్నాయి. లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండోరోజు కూడా దేశంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటేసింది. శుక్రవారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల 1,17,096 కాగా.. ఇవ్వాళ ఈ సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 1,41,986కు చేరింది. 285 మంది మరణించారు. 3,44,12,740 మంది రికవరీ అయ్యారు. 4,83,463 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 4,72,169గా నమోదయ్యాయి.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యుక్త వయస్కులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల్లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తోంది. ఈ నెల 3వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. లక్షల సంఖ్య 15-18 సంవత్సరాల్లోపు పిల్లలు తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీన్ని మరింత ముమ్మరం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వ్యాక్సిన్ సెంటర్లను నెలకొల్పాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

ఈ వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్‌ను మాత్రమే వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ దీన్ని అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ డెవలప్ చేసిన క్లినికల్ ట్రయల్స్ అన్నీ సవ్యంగా ఉండటం వల్ల డ్రగ్ కంట్రోలర్ జనరల్.. కోవాగ్జిన్‌కు మాత్రమే అనుమతి ఇచ్చింది. కొన్ని చోట్ల కోవాగ్జిన్‌కు బదులుగా వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను 15 నుంచి 18 సంవత్సరాల్లోపు పిల్లలకు వేస్తోన్నట్లు వార్తలు వస్తోన్నాయి.
దీని పట్ల భారత్ బయోటెక్ యాజమాన్యం స్పందించింది. పిల్లల కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్‌కు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేసింది. మరో టీకాను వినియోగించవద్దని సూచించింది. మరో కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వినియోగానికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంది. కోవాగ్జిన్‌ను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో హెల్త్‌కేర్ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో టీకాను వాడొద్దని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications