For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger stock: ఈ స్టాక్ కొన్న వారికి కనక వర్షం.. లక్షను రూ.13 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్..మీరూ కొన్నారా

|

Multibagger stock: స్టాక్ మార్కెట్ అనేది ప్రజలు చాలా డబ్బు సంపాదించే ప్రదేశం. అయితే ఇది అందరికీ సంబంధించినది కాదు. చాలా మంది స్టాక్ మార్కెట్‌లో కూడా భారీ మొత్తంలో నష్టపోతుంటారు. మీరు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటే.. మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిలో సహనం, రీసెర్చ్, కంపెనీలు, వివిధ రంగాల గురించి సమాచారాన్ని పొందడం, నిపుణుల సలహాలు ఉన్నాయి. 2 సంవత్సరాల్లో భారీ రాబడిని అందించిన స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలికాన్ ఇంజనీరింగ్..

ఎలికాన్ ఇంజనీరింగ్..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఎలికాన్ ఇంజినీరింగ్ కంపెనీ(Elecon Engineering Company Ltd) షేర్ల గురించి. ఎలికాన్ ఇంజినీరింగ్ కంపెనీ షేర్లు 2 సంవత్సరాలలో చాలా బలమైన రాబడులను అందించాయి. ఈ స్టాక్ 24 జూలై 2020న BSEలో రూ.25.15 వద్ద ఉండగా, ప్రస్తుతం దాని ధర రూ.329.50 వద్ద ట్రేడవుతోంది. ఈ కాలంలో ఈ స్టాక్ దాదాపు 1200 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ఈ స్టాక్ లో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. దాదాపు రూ.13 లక్షలకుపైగా మల్టీబ్యాగర్ రిటర్న్ పొందారు.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

ఎలికాన్ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ బహుళజాతి కంపెనీ. పారిశ్రామిక పరికరాల తయారీలో కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలికాన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలు, ఇండస్ట్రియల్ గేర్ సిస్టమ్స్, మైనింగ్ పరికరాల అతిపెద్ద ఆసియా తయారీదారుల్లో ఒకటి. ఈ కంపెనీని 1951లో ముంబైలోని గోరేగావ్‌లో ఈశ్వరభాయ్ బి పటేల్ స్థాపించారు. దేశంలోని ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ ప్రాజెక్టులు, ప్రారంభంలో కస్టమ్ మాన్యుఫ్యాక్చరింగ్ కన్వేయర్ సిస్టమ్‌లపై కంపెనీ ప్రారంభ దృష్టి కేంద్రీకరించింది. కంపెనీ 11 జనవరి 1960న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నమోదు చేయబడింది.

2022లో లాభం ఇలా..

2022లో లాభం ఇలా..

ఎలికాన్ ఇంజినీరింగ్ షేర్ 2022 వరకు భారీ రాబడిని ఇచ్చే స్టాక్‌లలో ఒకటి. ఈ స్టాక్ 03 జనవరి 2022న BSEలో రూ.191.60 వద్ద ఉండగా.., ప్రస్తుతం రూ.329.50 వద్ద ఉంది. ఈ కాలంలో స్టాక్ 72.03 శాతం వృద్ధిని సాధించింది. ఈ సమయంలో స్టాక్ లో లక్ష పెట్టుబడులు పెట్టిన వారికి రూ.1.72 లక్షల రాబడి వచ్చేది. ఇంత తక్కువ సమయంలో మరెక్కడా అలాంటి రాబడిని పొందడం కష్టం. ఏడాది కిందట ఈ స్టాక్ 22 జూలై 2021న BSEలో రూ. 145.45 వద్ద ఉంది. అప్పుడు ఈ స్టాక్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుతం రూ.2.27 లక్షలు రాబడి వచ్చేది.

6 నెలల రాబడి చూస్తే..

6 నెలల రాబడి చూస్తే..

ఎలికాన్ ఇంజినీరింగ్ షేర్ 6 నెలల్లో మంచి లాభాలను ఇచ్చింది. ఈ స్టాక్ 21 జూలై 2021న BSEలో రూ. 193.85 వద్ద ఉండగా, ఈరోజు రూ. 329.50 వద్ద ట్రేడవుతోంది. ఈ కాలంలో స్టాక్ 70.03 శాతం వృద్ధిని సాధించింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.2 లక్షలు పెట్టుబడిగా పెట్టి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.3.40 లక్షలుగా ఉండేది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.348.45 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 128.05 వద్ద ఉంది.

English summary

Multibagger stock: ఈ స్టాక్ కొన్న వారికి కనక వర్షం.. లక్షను రూ.13 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్..మీరూ కొన్నారా | Engineering Company stock gave multibagger returns

Elecon Engineering Company Ltd stock gave multibagger returns to its investors and turned one lakh to 13 lakhs
Story first published: Sunday, July 24, 2022, 13:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X