బెంగళూరులో ఒక్కరే ఉంటే నెలకు రూ. 60,000 ఖర్చవుతుందా? వైరల్ అవుతున్న యువతి 1BHK లెక్కలు!

ఉద్యోగం కోసమో, కెరీర్ కోసమో బెంగళూరు (Bengaluru) సిటీకి వచ్చే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే ఇక్కడికి వచ్చాక అందరికీ ఎదురయ్యే మొదటి పెద్ద సమస్య.. కాస్ట్ ఆఫ్ లివింగ్ (జీవన వ్యయం). ముఖ్యంగా ఇండ్ల అద్దెలు, రోజువారీ ఖర్చులు ఐటీ ఉద్యోగుల జేబులకు చిల్లులు పెడుతుంటాయి. తాజాగా ఓ బెంగళూరు యువతి తను ఒంటరిగా ఉంటున్న 1BHK ఫ్లాట్ నెలవారీ ఖర్చుల లెక్కలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ లెక్కలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

engaluru Woman Monthly Expenses 1BHK Rent HSR Layout Cost Of Living Viral Instagram

సింగిల్ బెడ్‌రూమ్ రెంట్ రూ. 36,000!

శ్రుతి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్.. బెంగళూరులోని మోస్ట్ పాపులర్ అండ్ డిమాండ్ ఉన్న ఏరియా అయిన 'HSR లేఅవుట్'లో ఒంటరిగా ఉంటోంది. తను షేర్ చేసిన వీడియో ప్రకారం.. కేవలం ఒక 1BHK ఫ్లాట్ కోసం ఆమె నెలకు అక్షరాలా రూ. 36,000 రెంట్ కడుతోంది. అంతేకాదు, ఇంట్లో వాడుకునే అప్లయెన్సెస్ (ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ లాంటివి) కూడా రెంట్‌వేనట. వాటి కోసం నెలకు ఇంకో రూ. 5,000 ఖర్చవుతుంది. ఇక కరెంట్ బిల్లు, పనిమనిషి జీతం కలిపి మరో రూ. 4,000 అవుతుందని చెప్పింది. అంటే ఇల్లు దాటకుండానే దాదాపు రూ. 45,000 ఖర్చయిపోతోంది!

ఫుడ్, ఫిట్‌నెస్ అండ్ కాఫీ ముచ్చట్లు

ఆమె హెల్తీ డైట్ ఫాలో అవుతూ ఇంట్లోనే వండుకోవడానికి ట్రై చేసినప్పటికీ.. గ్రోసరీస్ (కిరాణా), అప్పుడప్పుడు స్విగ్గీ, జొమాటో డెలివరీల కోసం నెలకు రూ. 7,000 నుండి రూ. 8,000 ఖర్చవుతుందట. ఆఫీస్‌కు, బయటకు వెళ్లడానికి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు రూ. 4,000 నుండి రూ. 5,000 అవుతాయి. ఇక ఫిట్‌నెస్ కోసం వెళ్లే పైలేట్స్, జిమ్ క్లాసుల ఫీజు నెలకు రూ. 5,000. ఇవన్నీ కాకుండా కాఫీలు, రెస్టారెంట్లలో తినడం, అప్పటికప్పుడు వచ్చే క్రేవింగ్స్ కోసం ఎంత ఖర్చవుతుందనేది తన "సెల్ఫ్ కంట్రోల్" మీద ఆధారపడి ఉంటుందని, ఇక షాపింగ్ ఖర్చుల గురించి అయితే మాట్లాడకపోవడమే మంచిదని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

'నా బ్యాంక్ అకౌంట్ ఒప్పుకోదు కానీ..'

"బెంగళూరులో అడల్ట్ లైఫ్ (ఒంటరిగా బతకడం) చాలా ఫన్నీగా, సరదాగా ఉంటుంది.. కానీ నా బ్యాంక్ అకౌంట్ మాత్రం ఈ ముచ్చటతో అస్సలు ఏకీభవించదు" అంటూ శ్రుతి ఫన్నీగా వీడియోను ముగించింది. అంటే, ఒంటరిగా ఉండటం వల్ల వచ్చే ఫ్రీడమ్ బాగున్నా, నెల చివరకు వచ్చేసరికి పర్స్ ఖాళీ అయిపోతుందని హింట్ ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఆమెకు నెలకు సుమారు రూ. 60,000 వరకు ఖర్చవుతోంది.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకరు "కనీసం కంఫర్ట్ కోసం ఇంత ఖర్చు పెట్టేవాళ్లు నేనొక్కడినే కాదు అని తెలిసి మనశ్శాంతిగా ఉంది" అని కామెంట్ చేయగా.. ఇంకొకరు మాత్రం "ఒక్కదానికే నెలకు రూ. 60,000 అంటే చాలా ఎక్కువ. నీకు మంచి పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ అవసరం" అని ఉచిత సలహా ఇచ్చారు. మరికొందరైతే క్యాబ్స్ కాకుండా కార్‌పూల్ వాడితే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు తగ్గుతాయని ఐడియాలు ఇస్తున్నారు. ఏదేమైనా బెంగళూరు (Bengaluru) లో ఒంటరిగా బతకడం అనుకున్నంత ఈజీ కాదని ఈ వైరల్ వీడియో మరోసారి ప్రూవ్ చేసింది!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+