IPO Listing: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోల కోలాహలం కొనసాగింది. మార్కెట్లు అస్థిరంగా కొనసాగుతున్నప్పటికీ అరంగేట్రం చేసిన ఐపీవోలు ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను అందించాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్‌ఫ్యూజ్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు మార్కెట్లో లిస్టింగ్ సమయంలో చౌక రేటుకు వచ్చి లాభాల గారడీ చేశాయి. కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈలో రూ.115కి లిస్టయ్యాయి. బంపర్ లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్ల ఇంట్రా-డేలో గరిష్ఠంగా ఒక్కోటి రూ.120 మార్కును తాకాయి. అయితే అద్భుతమైన లిస్టింగ్ తర్వాత షేర్లలో క్షీణత నమోదైంది. మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ బాధితుడిగా మారిపోయింది. దీనితో షేర్లు 2 శాతానికి పైగా క్షీణించి రూ.112 మార్కుకు పడిపోయాయి.

ఎన్‌ఫ్యూజ్ సొల్యూషన్ లిమిటెడ్ ఐపీవో తాజా ఇష్యూ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.22.44 కోట్లుగా ఉంది. ఐపీవో కోసం కంపెనీ 23.38 లక్షల తాజా షేర్లను జారీ చేసింది. మార్కెట్లో నేడు జాబితా చేయబడిన ఐపీవో మార్చి 15 నుంచి 19 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరచిఉంది. ఈ క్రమంలో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.91-96గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక్క లాట్ కొనుగోలు కోసం రూ.1,15,200 వెచ్చించారు. మార్చి 14న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.6.37 కోట్లను విజయవంతంగా సమీకరించింది.
3 రోజుల సబ్‌స్క్రిప్షన్ సమయంలో ఐపీవో మెుత్తంగా 400 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. చివరి రోజు అంటే 19 మార్చి 2024న ఐపీవో 357.31 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. మెుదటి రోజున 8.36 రెట్లు, రెండవ రోజున 39.45 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.


Click it and Unblock the Notifications