ED Raids: దేశంలో ఎడ్‌టెక్ రంగంలో బైజూస్ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది. అయితే నేడు కంపెనీ సీఈవో, వ్యవస్థాపకుడు రవీందరన్ బైజూకి సంబంధించిన బెంగళూరులోని కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ప్రకారం రవీందరన్ బైజు, అతని కంపెనీ థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్' కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ED) బెంగళూరులోని మూడు ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి.

2011లో ప్రారంభమై 2015లో యాప్ లాంచ్ చేసిన.. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ బైజూస్ ఆఫీసుల్లో చేపట్టిన సోదాల్లో అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఎడ్-టెక్ యునికార్న్ 2011-2023 మధ్య కాలంలో సూమారు రూ.28 కోట్ల విదేశీ విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందినట్లు సోదాల్లో వెల్లడైంది. ఇదే కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో కంపెనీ దాదాపు రూ.9,754 కోట్లను విదేశాల నుంచి పొందినట్లు వివిధ శాఖలకు తెలిపింది.
బైజూ, అతని సంస్థ థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో సుమారు రూ.944 కోట్లను ఖర్చుచేసినట్లు విదేశీ అధికార పరిధికి పంపిన వివరాల్లో వెల్లడించింది. దీనికి తోడు 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయలేదు. అకౌంట్స్ ఆడిట్ చేయలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ప్లాట్‌ఫారమ్‌పై దర్యాప్తు చర్యలు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలో ఈడీ దర్యాప్తులో భాగంగా బైజూస్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రవీందరన్‌కు అనేక సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వీటి నుంచి అతను తప్పించుకుంటూనే ఉన్నాడని తెలుస్తోంది. దీంతో తాజా రైడ్స్ సంచలనంగా మారాయి. విచారణ కొనసాగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కరోనా తర్వాత కంపెనీ భారీ నష్టాలు నమోదు చేయటం ఫండింగ్ సమస్యల కారణంగా వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications