Bank Fraud: బ్యాంక్ మోసాల్లో 150 మంది అరెస్ట్.. భారీగా ఈడీ ఆస్తుల అటాచ్మెంట్..
ED on Bank Frauds: బ్యాంక్ మోసాలకు సంబంధించిన 1,105 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. వీటికి సంబంధించి మెుత్తం రూ.64,920 కోట్ల విలువైన మెుత్తాన్ని క్రైమ్ రాబడిని అటాచ్ చేసింది.
అలాగే ఈ కేసుల్లో 150 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ వ్రాతపూర్వకంగా ఈ సమాచారాన్ని అందించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణాన్ని కలిగి ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య మార్చి 2023 చివరి నాటికి 14,159కి పెరిగిందని సహాయ మంత్రి భగవత్ కరాద్ వెల్లడించారు. జూన్ 2019 చివరి నాటికి వీరి సంఖ్య 10,209గా ఉన్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయానికొస్తే జూన్ 2019 చివరినాటికి 1,950 మంది ఉన్న ఈ డిఫాల్టర్ల సంఖ్య మార్చి 2023 చివరి నాటికి 2,504కి పెరిగింది.
ఈడీ నుంచి అందిన సమాచారం ప్రకారం మనీలాండరింగ్ నిరోధన చట్టం 2022 నిబంధనల ప్రకారం దర్యాప్తు కోసం ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన వాటితో సహా దాదాపు 1,105 బ్యాంక్ మోసం కేసులను ఇది స్వీకరించింది. పిఎంఎల్‌ఎ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకున్న ఫలితంగా రూ.64,920 కోట్లను అటాచ్ చేయటం జరిగిందని కరాద్ చెప్పారు. 277 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు(పిఎంఎల్‌ఎ) ముందు దాఖలు చేసినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications