ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభుత్వం ఎనిమీ ఆస్తుల అమ్మకంపై దృష్టి సారించింది. వీటిని వేలం వేయడం ద్వారా రూ.1 లక్ష కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఎనిమీ ఆస్తుల అమ్మకపు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందంతో పాటు మరో రెండు ఉన్నతస్థాయి కమిటీలు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. 1962లో చైనాతో యుద్ధం తర్వాత, 1965, 1971లలో పాకిస్తాన్‌తో యుద్ధం అనంతరం కింద ప్రభుత్వం సీజ్ చేసిన ఎనిమీ ఆస్తులు 9,406 ఉన్నాయి.

ఎనిమీ ఆస్తుల ద్వారా రూ.1 లక్ష కోట్లు
ఈ 9,406 ప్రాపర్టీల అమ్మకం ద్వారా రూ.1 లక్ష కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వందల కోట్ల ఎనిమీ షేర్లు కూడా ఉన్నాయి. అలాగే బంగారం, వెండి వంటి ఆభరణాల రూపంలో రూ.38 లక్షల ప్రాపర్టీని నాడు సీజ్ చేసింది. ఇందులో ఎక్కువ ఆస్తులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎనిమీ ఆస్తులు అమ్మకం ఆర్థిక మాంద్యానికి మంచి మందుగా భావిస్తోంది కేంద్రం.

వారికి హక్కు లేదు.. పాకిస్తాన్ కూడా విక్రయించింది
మనదేశం నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిపోయినవారి ఆస్తులను ఎనిమీ ఆస్తులుగా చెబుతారు. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968లో తీసుకు రాగా, 2017లో సవరించారు. పాకిస్తాన్, చైనా వెళ్లిపోయిన వారికి ఈ ఆస్తులపై ఎలాంటి హక్కులు ఉండవు. పాకిస్తాన్ కూడా గతంలో భారతీయులకు చెందిన ఇలాంటి ఆస్తులను ఇలాగే విక్రయించింది.

ఎనిమీ ఆస్తులు ఏ రాష్ట్రాల్లో ఎంత అంటే?
9,406 ఆస్తుల్లో దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ఎనిమీ ఆస్తులు 9280, చైనీస్ ఎనిమీ ఆస్తులు 126 ఉన్నాయి. పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వాసులు 4,991, పశ్చిమ బెంగాల్ వాసులు 2,735, ఢిల్లీ వాసులు 487 మంది ఉన్నారు. చైనాకు వెళ్లిన వారిలో ఎక్కువగా మేఘాలయ నుంచి 57 మంది ఉన్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి 29, అసోం నుంచి 7గురు ఉన్నారు.

పాక్ జాతీయుల ఎనిమీ ఆస్తులు
పాక్ జాతీయుల ఎనిమీ ఆస్తులు... యూపీలో 4,991, ఉత్తరాఖండ్ 50, బీహార్ 79, పశ్చిమ బెంగాల్ 2,735, అసోం 6, చత్తీస్‌గఢ్ 78, తెలంగాణ 158, ఏపీ 1, అండమాన్ 1, తమిళనాడు 34, కేరళ 60, కర్ణాటక 20, గోవా 263, మహారాష్ట్ర 48, గుజరాత్ 146, డయ్యూ 4, రాజస్థాన్ 22, హర్యానా 9, ఢిల్లీ 487 ఉన్నాయి.

చైనా జాతీయుల ఎనిమీ ఆస్తులు
చైనా జాతీయుల ఎనిమీ ఆస్తులు... ఢిల్లీలో 1, అసోంలో 15, మేఘాలయలో 57, బెంగాల్లో 51, కర్ణాటకలో 1, మహారాష్ట్రలో 1 ఉన్నాయి.

కేంద్ర ఆర్థిక శాఖలో జమ
ఈ ఆస్తుల వేలం పక్రియకు 2016లోనే శ్రీకారం చుట్టింది కేంద్రం. అందుకు వీలుగా 1968 నాటి శత్రు ఆస్తుల చట్టానికి సవరణలు చేసింది. దాని ప్రకారం కేంద్ర హోమ్ శాఖ అధీనంలోని శత్రు లేదా కాందిశీకుల ఆస్తుల సంరక్షణ విభాగం (సీఈపీఐ) ద్వారా కంపెనీల్లోని ఎనిమీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. వాటిని విక్రయించే అధికారాన్ని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖకు అప్పగించారు. ఈ వాటాల విక్రయం ద్వారా సమకూరే ధనాన్ని పెట్టుబడుల ఉపసంహరణ నిధుల పద్దు కింద కేంద్ర ఆర్థిక శాఖ కాతాలో జమ చేస్తారు.

ఈ షేర్లను అట్టి పెట్టుకుంది
గత ఏడాది కొన్ని షేర్లను అమ్మడం ద్వారా రూ.1,874 కోట్లు సమీకరించింది. ఇందులో ఐటీ మేజర్ విప్రోకు చెందిన 4.44 కోట్ల షేర్ల అమ్మకం ద్వారా రూ.1,150 కోట్లు సేకరించింది. 2018-19లో రూ.779 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. కేంద్రం 257 లిస్టెడ్ కంపెనీల్లోని షేర్లను అట్టి పెట్టుకుంది. అలాగే 327 అన్‌లిస్టెడ్ కంపెనీల్లోని షేర్లను అట్టి పెట్టుకుంది. ఇప్పుడు మరోసారి షేర్లను విక్రయించనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications