ఇంటర్నెట్ వేగం పెరగడంతో పాటు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ గేమింగ్ మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు అయినా సులభంగా గేమ్స్ ఆడగలిగే పరిస్థితి ఏర్పడింది.

భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం గత కొన్ని సంవత్సరాలుగా బంగారు గనిలా మారింది. ప్రతి సంవత్సరం సుమారు రూ. 17,000 కోట్లకు పైగా ఈ రంగం కేవలం ప్రకటనలు, మార్కెటింగ్‌పైనే ఖర్చు చేస్తోంది. క్రికెట్ టోర్నమెంట్లు వస్తే, ప్రకటనల వరదలా టీవీ, సోషల్ మీడియా, యూట్యూబ్ ఎక్కడ చూసినా గేమింగ్ యాప్ ప్రకటనలే కనిపిస్తున్నాయి.
కానీ ఇప్పుడు ఆ హడావుడికి ఒక్కసారిగా బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం "రియల్ మనీ గేమ్స్" డబ్బుతో ఆడే ఆన్‌లైన్ ఆటలు మీద నిషేధం విధించే కొత్త బిల్లును ముందుకు తెచ్చింది.
ఇంతవరకు పెద్ద పెద్ద హీరోలు, క్రికెటర్లు గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త చట్టం ప్రకారం, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేసినా రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల జరిమానా పడే ప్రమాదం ఉంది.
అందుకే బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లు తమ మేనేజ్‌మెంట్ టీమ్‌ల ద్వారా యాడ్ ఏజెన్సీలకు కొంతకాలం యాడ్స్ తగ్గించండి లేదా తీసేయండి అని చెప్పారని సమాచారం. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలే ఎందుకంటే ఇవి ఎక్కువగా పబ్లిక్ దృష్టిలో ఉండే ప్లాట్‌ఫారమ్‌లు.
క్రికెట్ స్పాన్సర్‌షిప్‌లకు దెబ్బ
భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, అది కోట్లాది మంది అభిమానులు అనుసరించే ఒక మతం లాంటిది మరియు ఒక పెద్ద వ్యాపారం కూడా. అందుకే పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి, ముఖ్యంగా గేమింగ్ కంపెనీలు, క్రికెట్ టోర్నమెంట్‌లలో భారీగా డబ్బులు ఖర్చుపెడతారు. ఈ స్పాన్సర్‌షిప్‌లు వారికి కోట్ల రూపాయల వ్యాపారాన్ని తీసుకురావడంతో పాటు, బ్రాండ్ ఇమేజ్‌ను కూడా బలపరుస్తాయి.
ఉదాహరణకు, డ్రీమ్11 (Dream11) ఇప్పటికే IPL, BCCI వంటి దేశంలోనే అతి పెద్ద టోర్నీలకు ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. అలాగే WinZo యాప్‌కు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నారు. RummyCircle కూడా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ద్వారా తన ప్రమోషన్‌ను ముందుకు తీసుకువెళ్తోంది. ఇదే విధంగా My11Circle యాప్, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ లాంటి స్టార్ క్రికెటర్లతో జతకట్టి ప్రచారం చేస్తోంది.
ఈ అన్ని ఒప్పందాలు ఇప్పటివరకు బలంగా కొనసాగుతూ, క్రికెట్‌లో గేమింగ్ కంపెనీల ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. అయితే తాజాగా వచ్చిన కొత్త చట్టం వల్ల ఈ స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనలు అనిశ్చితిలో పడిపోయాయి. కంపెనీలు, క్రికెటర్లు, సినీ నటులు ఇప్పుడు "వేచి చూద్దాం" మోడ్‌లోకి వెళ్లిపోయారు.
ఎంత డబ్బు ఖర్చవుతోంది?
గేమింగ్ కంపెనీలు కేవలం డిజిటల్ మార్కెటింగ్‌పైనే సుమారు $700 మిలియన్ ఖర్చు చేస్తాయి. దీనికి తోడు టీవీ, ఆఫ్‌లైన్ క్యాంపెయిన్‌లు, క్రియేటివ్ షూట్స్, సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్స్ ఇలా అన్నీ కలిపి మొత్తం ఖర్చు $2 బిలియన్ (రూ. 17,000 కోట్లకు పైగా). నిపుణుల చెఫ్తున్నట్టు "ఈ చట్టం పూర్తిగా అమలులోకి వస్తే, ఈ మొత్తం ఖర్చు ఒక్క రాత్రిలోనే ఆగిపోవచ్చు. అంతా గాల్లో కలిసినట్టే అవుతుంది."
ప్రభుత్వం ఎందుకు నిషేదిస్తుండంటే ఇటీవల యువతలో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. చాలా మంది ఆటల పిచ్చితో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. కొందరు అప్పులు తీసుకుని కూడా ఈ గేమ్స్ ఆడుతూ చివరికి కుటుంబాలను ఆర్థికంగా కష్టాల్లోకి నెడుతున్నారు. దీనివల్ల ఇంటి వాతావరణం చెడిపోవడం, సామాజిక సమస్యలు పెరగడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం "ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రచారం మరియు నియంత్రణ, 2025" పేరుతో కొత్త బిల్లును లోక్‌సభలో ఆమోదించింది.
ఇప్పటివరకు రణబీర్ కపూర్, ఆమిర్ ఖాన్, ఎంఎస్ ధోనీ, హృతిక్ రోషన్, సౌరవ్ గంగూలీ లాంటి పెద్ద స్టార్‌లు ఈ గేమింగ్ యాప్‌ల ప్రకటనలతో కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ కొత్త చట్టం తర్వాత వీరికి పెద్ద సమస్య వచ్చింది. ఒకవైపు వారు తీసుకున్న భారీ ఎండార్స్‌మెంట్ కాంట్రాక్టులు ఉన్నాయి. మరొకవైపు తమ పేరు, ఇమేజ్‌కి నష్టం జరగకుండా చూడాలి. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో వారికే గందరగోళంగా మారింది. నిపుణులు చెబుతున్నట్లుగా "చట్టం పూర్తిగా నిషేధం చేస్తే తప్ప, ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇలాంటి డీల్‌లను వదులుకోరు. కానీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశముందని భావిస్తే, కొందరు తప్పుకుంటారు."
ఇండస్ట్రీలో ఒకప్పుడు బంగారు గనిలా కనిపించిన రియల్ మనీ గేమింగ్ ఇప్పుడు భవిష్యత్తు తెలియని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రకటనల వరద తగ్గిపోతే నటులు, క్రికెటర్లు తమ భారీ ఆదాయంలో ఒక భాగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరోవైపు కంపెనీలు కొత్త యూజర్లను ఆకర్షించడానికి కొత్త మార్గాలు వెతకాల్సి ఉంటుంది. ఇదే సమయంలో యువతలో వ్యసనాన్ని తగ్గించాలన్న ప్రభుత్వ యత్నం కొంతవరకు ఫలిస్తుందేమో చూడాలి.
ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న తిరుగుతోంది. ఈ గేమింగ్ ప్రకటనల యుగం నిజంగా ముగిసిపోయిందా? లేకపోతే కొత్త రూపంలో మళ్లీ రంగప్రవేశం చేయబోతుందా? ఎందుకంటే ఒకప్పుడు వరదలా వచ్చిన రియల్ మనీ గేమింగ్ ప్రకటనలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోవడం ఆశ్చర్యకరం. ఈ మార్పు తాత్కాలికమా, లేక శాశ్వతమా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కొందరి అభిప్రాయం ప్రకారం, కఠినమైన నియమాలు, పెరిగిన పన్నులు ఈ రంగాన్ని బలహీనపరుస్తాయని అంటున్నారు. కానీ మరోవైపు, డిజిటల్ యుగంలో కొత్త మార్గాలను వెతికే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి, గేమింగ్ ప్రకటనలు పూర్తిగా ముగిసిపోయాయా లేక మరో కొత్త వ్యూహంతో మళ్లీ మార్కెట్‌ను ఆకర్షిస్తాయా అన్నది చూడాల్సిందే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications