IPO News: ఈరోజు మార్కెట్లోకి లిస్ట్ అయిన రెండో ఐపీవో EMS లిమిటెడ్. దాదాపు 33 శాతం ప్రీమియం ధరకు దూకుడు లిస్టింగ్ నమోదైంది. ఇన్వెస్టర్లు తొలిరోజే మంచి సంపదను పొందారు.
ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.282.05 ధరకు లిస్ట్ అయ్యాయి. అసలు కంపెనీ ఐపీవోలో షేర్లను రూ.211 రేటుకు కేటాయించింది. 33.7 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ కావటంతో ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై రూ.71.05 భారీ లాభాన్ని పొందారు. కంపెనీ నీటి సరఫరా, వ్యర్థ జలాల సేకరణ, శుద్ధి వ్యాపారంలో నిమగ్నమై ఉంది.

EMS IPO సెప్టెంబర్ 8- 12 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంది. ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన రావటంతో ఐపీవో 76.21 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. EMS లిమిటెడ్ ఐపీవో రిటైల్ కోటా 30.55 సార్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కోటా 149.98 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 84.39 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. EMS లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ మొత్తం పరిమాణం రూ.321.24 కోట్లుగా ఉంది.
రిటైల్ ఇన్వెస్టర్లు EMS లిమిటెడ్ IPOలో కనీసం 1 లాట్, గరిష్టంగా 13 లాట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో లాటులో కంపెనీ 70 షేర్లను విక్రయించింది. అంటే ఎవరైనా కంపెనీ ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం రూ.14,770 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. 11.46 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర రూ.283.90 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications