Budget for unemployed: ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో భారీ మెరుపులు ఉంటాయని భావించిన ఉద్యోగులకు చుక్కెదురైంది. కేవలం ఒకేఒక్క బెనిఫిట్ ఇచ్చి కేంద్రం మమ అనిపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈసారి ఉద్యోగుల కంటే కూడా నిరుద్యోగితపై మోదీ సర్కార్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బడ్జెట్‌లో వారికోసం చేసిన ప్రకటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తూ, అవకాశాలను సృష్టించడమే తమ కీలక ప్రాధాన్యతలుగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయంతో పాటు ఉపాధి మరియు నైపుణ్యాలపై కీలక ప్రకటనలు చేశారు. వేతన జీవులను కాదని ఉద్యోగార్ధులకు కోసం పలు చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

కేవలం కొత్త పన్ను విధానంలో ఉన్న ఉద్యోగుల కోసం రెండు ప్రకటనలు చేసి నిర్మలమ్మ చేతులు దులుపుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను 50 వేల నుంచి 75 వేలకి పెంచుతున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికితోడు కొత్త పన్ను రెజీమ్‌లో ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో సడలింపు ఇచ్చారు. తద్వారా 17 వేల 500 ఆదా చేసుకునే అవకాశం కల్పించారు.
జీతం పొందే వ్యక్తులు మరియు పెన్షనర్ల మెరుగైన ఆర్థిక స్థిరత్వం కోసం కుటుంబ పెన్షన్ మినహాయింపు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రసంగంలో తెలిపారు. కొత్త పన్ను విధానంలో తగ్గింపు మొత్తాన్ని 15 వేల నుంచి 25 వేలు చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు లబ్ధి పొందుతారని వివరించారు.
ఇక కొత్తగా ఉద్యోగాలలోకి ప్రవేశించే వ్యక్తులందరికీ ప్రభుత్వం ఒక నెల వేతనాన్ని అందజేస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని EPFO ద్వారా ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు బదిలీ చేస్తుందని స్పష్టత ఇచ్చారు. 15 వేల వరకు 3 వాయిదాల్లో దీన్ని పూర్తి చేస్తామన్నారు. నెలకు 1 లోపు జీతం పొందే ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని, 210 లక్షల మంది యువత ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఉద్యోగుల మొదటి 4 ఏళ్ల ఉపాధిలో వారి EPFO సహకారం ఆధారంగా ఉద్యోగులు మరియు యజమానులకు నేరుగా ప్రోత్సాహకాలు అందించబడతాయని ప్రభుత్వం పేర్కొంది. 500 అగ్రశ్రేణి కంపెనీల్లో యువత కోసం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో 10 మిలియన్ల మంది యువకులకు చేరువచేసి, నెలకు 5 వేల చొప్పున అలవెన్స్ మరియు 6 వేల వన్ టైం సహాయం చేస్తామన్నారు. CSR ఫండ్స్ నుంచి ఈ శిక్షణ మరియు ఇంటర్న్‌షిప్ ఖర్చులో 10 శాతాన్ని కంపెనీలు భరించాల్సి ఉంటుందని వివరించారు.


Click it and Unblock the Notifications