గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల దీర్ఘకాల సేవకు ఇచ్చే బహుమతిగా పరిగణించబడే ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. ఇప్పటి వరకు ఒక సంస్థలో ఐదు సంవత్సరాలు నిరంతర సేవలో ఉన్న తర్వాతే ఈ గ్రాట్యుటీ చెల్లింపు అర్హత కలిగేది. అయితే కొత్త లేబర్ కోడ్ అమలుతో ఈ అర్హత కాలం కేవలం ఒక సంవత్సరానికి తగ్గించారు. అందువల్ల ఉద్యోగంలోకి కొత్తగా ప్రవేశించిన వారికీ ఇది మరింత లాభదాయకంగా మారింది. అయినప్పటికీ, ఈ ప్రయోజనం ఉద్యోగికి శాశ్వత హక్కు కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కంపెనీ గ్రాట్యుటీ చెల్లింపును పూర్తిగా నిరాకరించే హక్కు కలిగి ఉంటుంది. ఈ నిబంధనలు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972 కింద స్పష్టంగా పేర్కొనబడినవి.
ఈ చట్టం ప్రకారం అర్హులైన ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించడం కంపెనీ బాధ్యత. సరైన కారణం లేకుండా కంపెనీ స్వయంకృతంగా గ్రాట్యుటీని ఆపడం చట్టవిరుద్ధం. అంతేకాకుండా, కావాలనే ఆలస్యం చేస్తే వారు పెండింగ్ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగి నిర్వహించిన చర్యలు సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండి, సంస్థ నష్టపోయినట్లు ఆధారాలతో నిరూపితమైతే, అలాంటి సందర్భాల్లో గ్రాట్యుటీని నిలిపివేసే హక్కు కంపెనీకి ఉంటుంది.

ఉద్యోగి మోసం చేయడం అనేది గ్రాట్యుటీ కోల్పోయే ప్రధాన కారణాలలో ఒకటి. లంచం తీసుకోవడం, కంపెనీ ఆస్తులను దుర్వినియోగం చేయడం, నకిలీ పత్రాలను సమర్పించడం లేదా సంస్థ నమ్మకాన్ని దెబ్బతీసే ఏదైనా స్వభావం గల చర్య జరిగినా అది సీరియస్ మిస్కండక్ట్ గా పరిగణించబడుతుంది. ఈ తరహా చర్యలు నిరూపితమైతే, సంస్థకు గ్రాట్యుటీని పూర్తిగా నిలిపివేసే హక్కు ఉంటుంది. అనైతిక ప్రవర్తన కూడా ఇదే తరహా తీవ్రతతో పరిగణించబడుతుంది. కార్యాలయంలో హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన లేదా సహోద్యోగులకు నష్టం కలిగించే చర్యలు వంటి కేసులు విచారణలో సత్యంగా తేలితే..ఉద్యోగి చేసిన సేవా కాలం ఎంత ఉన్నా గ్రాట్యుటీని నిలిపివేయవచ్చు.
కొన్ని సందర్భాల్లో ఉద్యోగి చేసిన తప్పు కంపెనీకి ప్రత్యక్ష ఆర్థిక నష్టాన్ని కలిగిస్తే, సంస్థ ఆ నష్టాన్ని గ్రాట్యుటీ మొత్తంలో నుంచి తగ్గించుకునే హక్కు కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఉద్యోగి నిర్లక్ష్యంగా కారణంగా కంపెనీకి భారీ నష్టం జరిగిందనుకోండి. ఆ నష్టం ఉద్యోగి వైఫల్యంతోనే జరిగిందని నిరూపించగలిగితే, కంపెనీ ఆ నష్టాన్ని గ్రాట్యుటీ మొత్తం నుండి మైనస్ చేసి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంది. నష్టం గ్రాట్యుటీ మొత్తాన్ని మించి ఉంటే.. ఉద్యోగికి ఏమీ దక్కకపోయే పరిస్థితి కూడా ఉంటుంది.
అయితే గ్రాట్యుటీని ఆపడం అంత తేలికైన ప్రక్రియ కాదు. కంపెనీకి సరైన ఆధారాలు ఉండాలి, ఉద్యోగిపై ఆరోపణలు రుజువయ్యేంత వరకు అతనికి వివరణ చెప్పే అవకాశం ఇవ్వాలి. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు gratuity నిలిపివేయడం చట్టబద్ధం కాదు. ఆరోపణలు రుజువైన తర్వాతే కంపెనీ నిర్ణయం తీసుకోవాలి.ఇటువంటి చట్టపరమైన రక్షణ ఉద్యోగులను అన్యాయ నిర్ణయాల నుండి కాపాడుతుంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. గ్రాట్యుటీ ఉద్యోగి హక్కే అయినప్పటికీ.. అది తప్పులేమీ చేయకుండా నిష్పక్షపాతంగా పనిచేసినపుడు మాత్రమే అర్హత పొందే ప్రయోజనంగా ఉంటుంది. మోసం, అనైతిక ప్రవర్తన, కంపెనీకి నష్టం కలిగించడం వంటి తీవ్రమైన తప్పులు చేసిన పరిస్థితుల్లో మాత్రమే కంపెనీ గ్రాట్యుటీని చెల్లించకుండా ఆపే అవకాశం ఉంటుంది. సరైన ప్రక్రియను అనుసరించిన తర్వాత మాత్రమే సంస్థ అటువంటి నిర్ణయం తీసుకోగలదు. కాబట్టి ఉద్యోగులు తమ ఉద్యోగ కాలంలో పై మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లోను చేయవద్దు.. అలా చేస్తే మీకే నష్టమని గుర్తించుకోండి
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications