ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తున్న తరుణంలో చాలా సంస్థలు ఉద్యోగులకు షాక్ ఇస్తుంటే అమెజాన్ కు మాత్రం ఉద్యోగుల ఆందోళనతో చేదు అనుభవం ఎదురైంది .అమెజాన్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా తమకు వ్యక్తిగత సంరక్షణ పరికరాలను అందింకచపోవడం, ఉద్యోగుల రక్షణ పట్టించుకోకపోవటం తదితర ఆరోపణలతో అమెరికాలోని అమెజాన్ గిడ్డంగుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.అయితే అమెజాన్ ఉద్యోగుల సమీ మన దేశంలో కాదు.

అమెరికా అమెజాన్ గిడ్డంగుల్లో సిబ్బందికి కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రికార్డు స్తాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నసంగతి తెలిసిందే. 130కి పైగా అమెజాన్ గిడ్డంగుల్లో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వర్కర్స్ రైట్స్ గ్రూప్,యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్ తెలిపింది. ఒక పక్క కరోనా మహమ్మారి అడ్డు అదుపూ లేకుండా విస్తరిస్తోంటే, మరోవైపు అమెజాన్ సంస్థ ఉద్యోగులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ వందల మంది అమెజాన్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు రెడీ అయ్యారు . నేటి నుండి, 300 మందికి పైగా అమెజాన్ ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా నిరసనకు దిగుతున్నారు .

మౌలిక రక్షణా సదుపాయాల కోసం అమెజాన్ ఉద్యోగుల ఆందోళన
ఇక తమ ప్రాణాలకు రక్షణ లేని వ్యవస్థలో పని చెయ్యలేమని ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్న గిడ్డంగుల వద్ద పనిచేసేవారికి సౌకర్యాలతో పాటు, గిడ్డంగులను బాగా శుభ్రపరచడం, భద్రతా సామగ్రి, జీతంతో కూడిన అనారోగ్య సెలవు, ప్రమాద వేతనం కూడా అందించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే సంస్థను గట్టిగా నిలదీసిన ఉద్యోగులపై కూడా ప్రతీకారం తీర్చుకోవద్దని అమెజాన్‌ను కోరుతున్నారు.

ఆదాయం మీదే ధ్యాస అని ఆరోపణలు ..నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు దృష్టి
అమెజాన్ సంస్థకు ఆదాయంమీద ధ్యాసే తప్ప తమ భద్రతపై శ్రద్ధ లేదని వారు ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గిడ్డంగులను మూసివేసి శానిటైజేషన్ కార్యక్రమాలను పూర్తిగా చేపట్టాలని కోరారు. లేదంటే తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి వుందని వారు అంటున్నారు . అయితే తాజా పరిణామాలపై అమెజాన్ సంస్థ ఇంకా స్పందించలేదు . ఉద్యోగుల రక్షణకు కావాల్సిన చర్యలు చేపదుతున్నామని గతంలో ప్రకటించిన సంస్థ మాటలకే పరిమితం అయ్యింది . ఇక మరోవైపు ఈ ఆరోపణలపై నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఏం చెయ్యనుందో వేచి చూడాలి


Click it and Unblock the Notifications