For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిరిండియా కొనుగోలు రేసు నుండి ఉద్యోగుల సంఘం ఔట్

|

ఎయిరిండియా ఉద్యోగులు కంపెనీని కొనుగోలు చేసేందుకు బిడ్డింగ్ వేసేందుకు ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల బృందం కొనుగోలు రేసులో లేనట్లుగా కనిపిస్తోంది. 200 మందికి పైగా బృందంగా ఏర్పడి అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్‌తో కలిపి సంస్థ కొనుగోలుకు బిడ్ దాఖలు చేసింది. అయితే, నిబంధనల ప్రకారం సంస్థను కొనుగోలు చేసేందుకు కావాల్సిన అర్హతలు బిడ్‌లో లేవని ఎయిరిండియా నిర్ధారించినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రయివేటీకరణ ప్రక్రియలో తదుపరి దశకు ఈ బిడ్‌ను ఎంపిక చేయడం లేదని చెబుతూ సోమవారం ఉద్యోగాల సంఘానికి లేఖ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాటా సన్స్, స్పైస్ జెట్ సంస్థలు కొనుగోలు రేసులో ముందు ఉన్నట్లుగా తెలుస్తోంది. తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ రెండు సంస్థలు మరింత సమగ్రమైన వివరాలతో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ దాఖలు చేయవలసి ఉంటుంది.

Employees out of reckoning to run Air India

ఉద్యోగుల సంఘం అర్హత సాధించలేదని కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మాలిక్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడాన్ని ధృవీకరించిన ఏకైక సంస్థ టాటా సన్స్ అని తెలుస్తోంది. స్పైస్ జెట్‌ను ధృవీకరించాల్సి ఉంది.

English summary

ఎయిరిండియా కొనుగోలు రేసు నుండి ఉద్యోగుల సంఘం ఔట్ | Employees out of reckoning to run Air India

Air India employees have been unsuccessful in their bid for being the new owners of Air India.In a three-page letter to employees, Meenakshi Mallik, Commercial Director, has said that she has seen an email from the transaction advisor EY to the government, informing the employees of AI that they have been unsuccessful in qualifying for the next phase of the Disinvestment Acquisition process.
Story first published: Monday, March 8, 2021, 16:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X