ఏడాదికి రూ.2.50 కోట్లు జీతం.. కొత్తగా వచ్చిన ఈ టెక్ స్కిల్ మీ దగ్గర ఉందా..?
High Paid Jobs: రానున్నది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇప్పటికే టెక్నాలజీ వేగంగా అభివృద్ధి, వినియోగం విరివిగా జరుగుతోంది. దీంతో ఉద్యోగాలు పోతాయని భయపడుతున్న వాళ్లు ఒకపక్కన ఉండగా.. కొత్త టెక్నీలజీలను నేర్చుకుని మంచి జీతాలు కొట్టేయాలని ఆలోచిస్తున్న వారు మరోపక్కన మనకు కనిపిస్తున్నారు. భయపడినంత మాత్రాన మనం మార్పును ఆపలేమన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం అంటున్నారు ఆశావాదులు.
ChatGPT ఇదొక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఎలాంటి ప్రశ్నలకైనా చిటికెలో జవాబులు అందిస్తూ ప్రపంచ టెక్ రంగంలో పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఇది అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు గూగుల్- మైక్రోసాఫ్ట్ కంపెనీల మధ్య పెద్ద యుద్ధానికి కారణంగా మారింది. కొంత మంది టెక్ నిపుణుల వాదన ప్రకారం రానున్న కాలంలో చాట్ జీపీటీ గూగుల్ కనుమరుగయ్యేలా చేస్తుందంటున్నారు. ప్రపంచంలోనే కఠిటనమైన యూనివర్సిటీ పరీక్షా పత్రాలకు సైతం జవాబులిచ్చి విజేతగా నిరూపించుకుంది ఈ నయా ఏఐ టూల్.

అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీపై పనిచేసేవారికి భవిష్యత్తు బంగారంగా మారనుందని తెలుస్తోంది. దీనికోసం పనిచేసే ప్రాంప్ట్ ఇంజనీర్లు ఏడాదికి రూ.2.70 కోట్ల వరకు వేతనాన్ని పొందే ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ సొంత ఏఐ టూల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. ఆంత్రోపిక్ అని పిలువబడే Google-ఆధారిత స్టార్టప్ 'ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ లైబ్రేరియన్' పోస్ట్ కోసం ఏడాదికి 3,35,000 లక్షల డాలర్లను వేతనంగా అందిస్తోంది. అలాగే కాలిఫోర్నియాలో ఉన్న ఆటోమేటెడ్ డాక్యుమెంట్ రివ్యూయర్ క్లారిటీ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌కు రూ.1.90 కోట్ల వార్షిక జీతాన్ని అందిస్తోంది.
ప్రాంప్ట్ ఇంజనీర్లు ఎవరు..?
AI రంగంలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక కొత్త జాబ్ రోల్. వీరు పనిని వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు బెస్ట్ పద్ధతులను కనుగొనడానికి AI చాట్‌బాట్‌లతో చాట్ చేసే నిపుణులు. వీరు సదరు ఏఐలలోని లోపాలను, దాగిఉన్న సామర్థ్యాలను గుర్తించేందుకు కృషి చేస్తుంటారు. వీరు ఇచ్చే సమాచారం ప్రకారం డెవలపర్లు సమస్యలను పరిష్కరిస్తుంటారు.
ప్రస్తుతానికి ప్రాంప్ట్ ఇంజనీర్ కావడానికి నిర్దిష్ట ధృవీకరణ లేదా డిగ్రీ అవసరం లేదు. ఏదేమైనప్పటికీ.. మెషీన్ లెర్నింగ్ లేదా ఎథిక్స్‌లో పీహెచ్‌డీలు ఉన్న వ్యక్తులు లేదా AI కంపెనీలను స్థాపించిన వారికి మంచి శాలరీలను ఆఫర్ చేసేందుకు ఈ రంగంలోని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇది పదాలతో చేసే పనికాబట్టి వీరికి మంచి రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. భాషపై కూడా పట్టు అవసరం. కొద్దిగా కోడింగ్ స్కిల్స్ ఉండటం వారు చేసే పనిని సులభతరం చేస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications