SBI Funds Management: ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓతో కోటీశ్వరులుగా మారిన ఉద్యోగులు..!
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓతో ఉద్యోగులు కోటీశ్వరులుగా మారారు. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లో పని చేస్తున్న 13 మంది ఉద్యోగులు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారారు. వీరికి గతంలో ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ESOP) షేర్లు కేటాయించారు. ఈ 13 మంది ఒక్కొక్కరి వద్ద రూ. 1 కోటికి పైగా విలువైన వెస్టెడ్ ఈక్విటీ షేర్లు ఉన్నాయి. వెస్టెడ్ షేర్లు అంటే.. ఇతరులకు ఈ షేర్లను విక్రయించవచ్చు. మంగళవారం ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. ఈ స్టాక్ బిఎస్‌ఇలో రూ. 610 వద్ద లిస్ట్ అయింది. ఇది దాని ఇష్యూ ధరపై 6.27% ప్రీమియంలో లిస్ట్ కాగా..ఎన్‌ఎస్‌ఇలో రూ. 613.30 వద్ద లిస్ట్ కాగా దాదాపు 7శాతం లిస్టింగ్ గెయిన్స్ అందించింది.
దీంతో 13 మంది వద్ద ఉన్న షేర్ల విలువ కోట్ల రూపాయలకు పెరిగాయి. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ దేవిందర్ పాల్ సింగ్ అత్యధికంగా లబ్ధి పొందారు. ఈయన వద్ద 21.14 లక్షల వెస్టెడ్ షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ. 121 కోట్లుగా ఉంది. ఐపీఓ ఇష్యూ ప్రైస్ తో ఇంత విలువ వచ్చింది. షేర్లు ధర పెరిగితే విలువ ఇంకా పెరుగుతోంది. దేవిందర్ పాల్ సింగ్ వద్ద అన్ వెస్టెడ్ షేర్లు కూడా ఉన్నాయి. వీటిని భవిష్యత్తులో వినియోగించుకుంటే దాదాపు రూ. 30 కోట్ల విలువ ఉండవచ్చని చెబుతున్నారు. ఇక్కడ అన్ వెస్టెడ్ షేర్లు అంటే విక్రయించడానికి వీలు లేని షేర్లు.

చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసన్ రామ అయ్యర్ వద్ద 18.25 లక్షల వెస్టెడ్ షేర్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.105 కోట్లుగా ఉంది. ఆయన వద్ద అన్ వెస్టెడ్ షేర్లు కూడా ఉన్నాయి. భవిష్యతో వీటి ద్వారా రూ.51 కోట్లు పొందే అవకాశం ఉంది. చీఫ్ ఆఫ్ స్ట్రాటజీ, డిజిటల్ & టెక్నాలజీ, హెడ్ ఆఫ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ శ్రీనివాస్ జైన్ దాదాపు రూ. 59 కోట్ల విలువైన వెస్టెడ్ షేర్లను కలిగి ఉన్నారు. చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ రాజీవ్ రాధాకృష్ణన్ వద్ద దాదాపు రూ. 36 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.
చీఫ్ రిస్క్ ఆఫీసర్ అపర్ణ నిర్గుడే వద్ద రూ. 31 కోట్ల విలువైన వెస్టెడ్ షేర్లు ఉండగా.. చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ మరియు హెడ్ ఆఫ్ లీగల్ వినయ దాతర్ దాదాపు రూ. 21 కోట్ల విలువైన వెస్టెడ్ షేర్లు ఉన్నాయి. వీరితో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇందర్‌జీత్ ఘులియాని, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రజత్ గ్రోవర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ సంజయ్ పుగావ్‌కర్, ఫండ్ మేనేజర్లు మోహన్ లాల్, మహేష్ ఛాబ్రియాలతో సహా పలువురు ఉద్యోగుల వద్ద కోటి రూపాలయల విలువైన షేర్లు ఉన్నాయి.
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ తొలిసారిగా 2018లో ఉద్యోగులకు ఈఎస్‌ఓపి (ESOP) కేటాయిచింది. ఒక్కో షేరుకు సుమారు రూ. 39 నుంచి రూ. 455 వరకు వినియోగ ధరలతో స్టాక్ ఆప్షన్లను మంజూరు చేశారు. ఐపీఓ ధరను రూ. 574గా నిర్ణయించడంతో ఉద్యోగులు గణనీయమైన లాభాలను ఆర్జించారు. ఐపీఓకు ముందు ఎస్‌బీఐ ఫండ్స్, బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ సాక్స్‌తో సహా 129 యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ. 2,663 కోట్లు సమీకరించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications