Tech News: దేశీయ ఐటీ రంగంలో టాప్ కంపెనీలుగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ప్రస్తుతం అత్యంత గడ్డు కాలాన్ని చూస్తున్నాయి. అనూహ్యంగా మూడు కంపెనీల్లోనూ ఒకే కథ కొనసాగుతోంది. దీంతో దేశంలోని టెక్కీలు కొంత ఆందోళనకు గురవుతున్నారు.
కొత్త వ్యాపారాన్ని పొందటంలో కంపెనీలు కష్టపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులు రాక ఉద్యోగులను బెంచ్ పై ఖాళీగా ఉంచుతున్నాయి. మూడో త్రైమాసిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని టాప్-5 టెక్ కంపెనీలు చెడ్డ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో సెప్టెంబర్ క్వార్టర్ మాదిరిగానే.. డిసెంబర్ త్రైమాసికంలో టాప్-4 ఐటీ సేవల సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, విప్రోలలో ఉద్యోగుల సంఖ్య తగ్గుదలను నమోదు చేసింది.

కేంద్రంలోని టెక్ అండ్ ఇన్‌ఫ్రా మంత్రిత్వ శాఖ ఈనెల 15న చేసిన ట్వీట్ ప్రకారం 2024 ప్రారంభమైన నాటి నుంచి దేశంలోని 48 కంపెనీలు దాదాపు 7,528 మంది ఉద్యోగులను లేఆఫ్ చేశాయని వెల్లడైంది. దీంతో ఉద్యోగం కోసం వేచి చూస్తున్న ఫ్రెషర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా తమకు సైతం మంచి ఉద్యోగ ఆఫర్లు టెక్ రంగంలో ఎప్పుడు దొరుకుతాయో అనే ఆవేదనలో ఉన్నారు. అలాగే టెక్ రంగంలో ఏఐ ప్రవేశం వల్ల ఉద్యోగులు కోరుకుంటున్న స్కిల్స్ సైతం భారీగా మారుతున్నాయి.
ఇదే సమయంలో బిఎన్‌పి పరిబాస్ ఇండియా తాజా నివేదిక మాత్రం టెక్ రంగంలోని ఉద్యోగులు, ఉపాధి ఆశావహులకు కొంత ఊరటను కల్పించేదిగా కనిపిస్తోంది. తాము కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ కంపెనీలను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. 2024లో ఐటీ సేవలం కంపెనీలు సైక్లికల్ రికవరీని నమోదు చేస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ఇదే క్రమంలో విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల షేర్ల విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సంస్థ లెక్కల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఐటీ సేవల పరిశ్రమలో పురోగతి తిరిగి కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications