Udyogini Scheme: వడ్డీ లేకుండా రుణం కావాలా..!
సమాజంలోని అన్ని వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను అమలు చేస్తుంటాయి. ప్రభుత్వ పథకాలు పేదల కోసం ప్రవేశపెడతారు. పేదవారిని వ్యాపారవేత్తగా మార్చడానికి కూడా పలు పథకాలు ప్రవేశపెట్టారు. అలాంటి స్కీమ్ లను ఉపయోగించుకుని చాలా పేదవారు లబ్ధి పొందారు. అలాంటి పథకాల్లో ఒకటి ఉద్యోగిని యోజన స్కీమ్. ఈ పథకం ద్వారా ఇప్పటికే చాలా మంది లబ్ధి పొందారు. అయితే ఈ పథకం ఎవరికి ఇస్తారు. ఎంత ఇస్తారు. వడ్డీ ఉంటుందా లేదా తెలుసుకుందాం.
ఉద్యోగిన యోజన పథకంలో భాగంగా మహిళలు ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలు పొందవచ్చు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రుణం తీసుకోవాలనుకునే మహిళలందరికీ ప్రభుత్వం నుంచి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు.

కొన్ని షరతులతో వడ్డీ లేని రుణాలు ఇచ్చినప్పటికీ, అన్ని బ్యాంకులు అలా ఇవ్వలేవు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. మహిళ కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. వితంతువులు, వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి లేదు. ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పుడు సాధారణంగా మీరు తీసుకున్న రుణం కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. కానీ ఈ ఉద్యోగిని పథకంలో అలా కాదు. ఇందులో మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా ఇస్తారు. ఇందులో ప్రభుత్వం 30 శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు. మీరు కూడా లోన్ తీసుకుని వ్యాపారం ప్రారంభించాలనుకుంటే.. ఈ పథకం ఉపయోగపడొచ్చు.


Click it and Unblock the Notifications