Reliance: ముఖేష్ అంబానీ కంపెనీలను వీడుతున్న ఉద్యోగులు.. పూర్తి వివరాలు..
Mukesh Ambani: రిలయన్స్ గ్రూప్‌లో ముఖేష్ అంబానీ కింద అనేక కంపెనీలు ఉన్నాయి. పెట్రోలియం నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా రిటైల్ రంగంలో పెద్ద పాదముద్రను కలిగి ఉంది.
కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని టెలికాం, రిటైల్ యూనీట్లు, రిలయన్స్ రిటైల్, జియోలలో అట్రిషన్ రేటు అంటే ఉద్యోగుల రాజీనామాలు 64.8 శాతం పెరిగినట్లు వెల్లడించింది. FY23లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి ఏకంగా 1,67,391 మంది ఉద్యోగులు నిష్క్రమించారని పేర్కొంది. ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ నుంచి 1,19,229 మంది, జియో నుంచి 41,818 మంది రాజీనామాలు చేశారు.

ఇదే క్రమంలో ఆయిల్ అండ్ కెమికల్ నుంచి అత్యల్పంగా 2,742 మంది రాజీనామా చేసినట్లు ప్రకటించింది. కంపెనీ నియామకాల ట్రెండ్‌లు కూడా అప్‌ట్రెండ్‌ను నమోదు చేశాయి. FY23లో కంపెనీ మొత్తం 2,62,558 మంది ఉద్యోగులను నియమించుకుంది. FY22లో ఈ సంఖ్య 2,32,822గా ఉంది. ప్రస్తుతం మెుత్తం రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 3,89,414గా ఉంది. ఈ క్రమంలో ఉద్యోగుల ప్రయోజనాల కోసం రూ.24,872 కోట్లను వెచ్చించినట్లు తెలిపింది.
2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ గ్రూప్ కన్సాలిడేటెడ్ నికర లాభం 11.3 శాతం పెరిగి రూ.73,670 కోట్లకు చేరుకుంది. రానున్న ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా 2300 కంటే ఎక్కువ నగరాలు, పట్టణాలకు తమ 5జీ సేవలను విస్తరిస్తున్నట్లు ముఖేష్ అంబానీ ఇన్వెస్టర్లకు వెల్లడించారు. అలాగే రిటైల్ కస్టమర్లకు కూడా తమ ఉత్పత్తులను విస్తరించేందుకు కంపెనీ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications