Emmforce Autotech IPO: నెలాఖరున మార్కెట్లోకి లిస్టింగ్ కోసం అడుగుపెట్టిన ఐపీవో నేడు మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం నిమిషాల్లో స్టాక్ ఇన్వెస్టర్ల డబ్బును అమాంతం డబుల్ చేసింది. ప్రీమియం లిస్టింగ్ తర్వాత సైతం కంపెనీ షేర్లు లాభాలను కొనసాగించాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మార్కెట్లోకి నేడు అడుగుపెట్టిన ఎమ్‌ఫోర్స్ ఆటోటెక్ ఐపీవో గురించే. ఆమ్‌ఫోర్స్ ఆటోటెక్ షేర్లు 90 శాతం లాభంతో రూ.186.20 వద్ద బలమైన జాబితాను నేడు నమోదు చేశాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఇన్వెస్టర్లు ఒక్కో షేరును రూ.98 రేటుకు కొనుగోలు చేశారు. దేశంలోని రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం ఐపీవో ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 25 వరకు తెరచి ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.53.90 కోట్లను సమీకరించింది.

లిస్టింగ్ తర్వాత ఎమ్‌ఫోర్స్ ఆటోటెక్ షేర్లు 5% ఎగువ సర్క్యూట్‌తో రూ.195.51కి చేరాయి. ఆటోటెక్ షేర్లు లిస్టింగ్ రోజునే పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. ఐపీవోలో పాల్గొని షేర్లను పొందిన ఇన్వెస్టర్లు తొలిరోజే ఒక్కో షేరుపై ఏకంగా రూ.97.51 భారీ లాభాన్ని ఆదాయంగా పొందారు. తాజా ఐపీవోకి ముందు కంపెనీలో 100 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 73.17 శాతానికి పరిమితమైంది. కంపెనీ షేర్లు నేడు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా చేయబడ్డాయి.
ఐపీవోపై మొత్తం 364.37 రెట్లు బెట్టింగ్‌లు జరిగాయి. కంపెనీ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 267.62 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 861.98 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో 160.58 రెట్లు బెట్టింగ్ జరిగాయి. రిటైల్ పెట్టుబడిదారులు కంపెనీ ఐపీవో 1 లాట్‌కు 1200 షేర్లను లాట్ పరిమాణంగా నిర్ణయించింది. ఇందుకోసం లాట్ కనీస పెట్టుబడి రూ.1,17,600 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications