Gold: బంగారం ధర ఇక్కడ నుంచి ఇంకా 12 శాతం వరకు పెరిగే అవకాశం..!
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తగ్గేటప్పుడు నెమ్మదిగా తగ్గతూ పెరిగేటప్పుడు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం, అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారుతుండడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే లోహాలపై పెట్టుబడి పెడుతున్నారు. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో వీటి ధరలు బాగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ లాభాల స్వీకరిస్తున్నారు. అందుకే కొద్ది రోజులు పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి.
ఇప్పటికీ కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు వంటి కారణాల వల్ల బంగారం, వెండికి డిమాండ్ భారీగానే ఉందని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. గత ఆరు వారాలుగా బంగారం 4,060 డాలర్ల వద్ద, వెండి 58 డాలర్ల దగ్గర ట్రేడవుతున్నాయని అంచనా వేసింది. చాలా దేశాలు తమ విదేశీ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయని పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎందుకంటే బంగారం నుంచి వడ్డీ ఆదాయం రాదని వివరిస్తుంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం వంటివి.. పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయని విశ్లేషించింది.

ఈ కారణంగానే గోల్డ్ రేటు ఇటీవల కొంత తగ్గడం పేర్కొంది. బంగారం ధర ఇంకా సుమారు 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ అంచనా వేసింది. వెండి ధరలు కూడా ఇదే విధంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని గుర్తించుకోవాలని తెలిపింది. మధ్యలో కొంత తగ్గడం, మళ్లీ పెరగడం సాధారణమేనని వివరించింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొంత మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్ ల్లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చని సూచిస్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ గా కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా.. క్రమక్రమంగా పెట్టుబడి పెడితే నష్టభయం తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications