Adani Green Energy stock: ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీదే భవిష్యత్తు అని తేటతెల్లమైంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీల షేర్లు మాత్రం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బ్రోకరేజ్ కంపెనీలు సైతం అదానీ షేర్లకు బై రేటింగ్ అందిస్తున్నాయి.
ముందుగా మనం మాట్లాడుకోబోతున్నది అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ షేర్ల గురించే. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లకు BUY రేటింగ్ కొనసాగించింది. దీని వెనుక ఉన్న సానుకూల అంశం మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ నుండి కాంట్రాక్ట్‌ను పొందుకోవటమే. ఈ క్రమంలో అదానీ గ్రీన్ గుజరాత్‌లోని ఖవ్డా పునరుత్పాదక ఇంధన పార్కు నుంచి 5,000 మెగావాట్లు సరఫరా చేయగా, అదానీ పవర్ కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుండి 1496 మెగావాట్లను సరఫరా చేస్తుంది.

అదానీ గ్రూప్ సంస్థ పోటీ బిడ్డింగ్ ప్రక్రియలో 5 GW సోలార్ పవర్‌ను సరఫరా చేయడానికి బిడ్‌ను పొందుతున్నట్లు ప్రకటించింది. దేశీయ బ్రోకరేజ్ MSEDCL బిడ్ కోసం ప్రకటించిన kWhకి రూ.2.70 ఫ్లాట్ రేటును ఆకర్షణీయంగా పేర్కొంది. ప్రస్తుతం అదానీ గ్రూప్ సురక్షిత PPA సామర్థ్యం ఇప్పుడు దాదాపు 26 GWకి పెరిగింది. ఇది FY29-30 నాటికి కంపెనీ ప్లాన్ చేసిన 50 GWలో 50 శాతం అని ఎమ్కే గ్లోబల్ తెలిపింది. సోలార్ లేని సమయాల్లో కూడా స్థిరమైన విద్యుత్ సరఫరాను ఇష్టపడే డిస్కమ్‌ల నేపథ్యంలో FDRE, RE+BESS/పంప్ హైడ్రో మొదలైన వాటితో పాటు హైబ్రిడ్ బిడ్డింగ్ మరింత ట్రాక్షన్‌ను పొందాయి.
అదానీ గ్రీన్ ఈ డీల్ వార్త మార్కెట్లోకి రావటంతో షేర్లు 7 శాతంపైగా పెరిగి గరిష్టంగా రూ.1,920కి చేరాయి. ఇదే క్రమంలో బ్రోకరేజ్ ఎంకే గ్లోబల్ కంపెనీ టార్గెట్ ధరను ప్రస్తుత ధర కంటే 33 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో ఇంట్రాడేలో అదానీ పవర్, అదానీ గ్రీన్ స్టాక్స్ ఏకంగా 5 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూస్..
మరోపక్క అదానీకి ఆందోళన కలిగిస్తున్న అంశం శ్రీలంకలో జరుగుతున్న పొలిటికల్ అనిశ్చితి. నేషనల్ పీపుల్స్ పవర్ ప్రభుత్వం ఎన్నికైతే శ్రీలంకలో భారత్ కు చెందిన అదానీ గ్రూప్ 450 MW పవన విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేస్తామని నాయకుడు అనుర కుమార దిసానాయకే పేర్కొన్నాడు. ఒప్పందం శ్రీలంకక ప్రయోజనాలకు విరుద్ధంగా అవినీతిని కలిగి ఉందని అన్నారు. ఫిబ్రవరి 2023లో, శ్రీలంక బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అదానీ గ్రీన్ ఎనర్జీ 442 మిలియన్ డాలర్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టును ఆమోదించింది. దీని ఏర్పాటు ఉత్తర శ్రీలంకలోని మన్నార్, పూనేరిన్‌లలో ప్లాన్ చేయబడ్డాయి. స్థానికంగా యూనిట్ విద్యుత్ $0.0488కి అందుబాటులో ఉంటే శ్రీలంక అదానీ నుండి యూనిట్‌కు $0.0826 చొప్పున ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని దిసానాయకే పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications