General Motors: GM ఫౌండర్ డైరెక్టర్ కన్నుమూత.. ఈయన పేరు చెబితే గణితం గడగడలాడాల్సిందే..
TN Subramanyam: ప్రపంచ స్థాయిలో భారత్ ఖ్యాతిని అందనంత ఎత్తుకు తీసుకెళ్లిన వారు ఎందరో ఉన్నారు. వారు ప్రస్తుతం ఈ భూమి మీద లేకపోయినా చరిత్ర పుటల్లో, భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి ఓ మేరు పర్వతం ఒకటి నేలవాలింది. 76 ఏళ్ల వయస్సులో ఆయన తనువు చాలించారు.
భారతీయ సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు, అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ వ్యవస్థాపకులు అయిన టీఎన్ సుబ్రమణ్యం మంగళవారం కన్నుమూశారు. కంపెనీ డైరెక్టర్ గా కొంతకాలం పాటు సేవలందించారు. 1979లో అమెరికాకు వలస వెళ్లి, ఇండియాతో పాటు అమెరికాలోనూ విద్యా రంగాలలో ప్రసిద్ధి చెందారు.

గణిత ప్రపంచం కోసం ఆయన అందించిన సేవలు ఎనలేనివి. మాథమేటికల్ మోడల్స్, సిద్ధాంతాల గొప్ప వారసత్వాన్ని తరువాతి తరానికి అందించారు. తమ కార్ల కోసం గణిత నమూనాలను రూపొందించడానికి జనరల్ మోటార్స్ ఆయన్ను నియమించుకుంది. తరువాత అదే కంపెనీ కోసం రూట్ వన్ అనే సంస్థను స్థాపించారు. ఇది అన్ని GM కార్లు మరియు GPS సిస్టమ్‌లకు ఆటో-ఫైనాన్సింగ్‌ను నిర్వహిస్తుంది.
మిచిగాన్‌లోని ట్రాయ్‌లో జనరల్ మోటార్స్ సైట్ కి సుబ్రమణ్యమే సర్వర్ ఆర్కిటెక్ట్. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఓ పర్యటనలో ఆయన్ను వ్యక్తిగతంగా కలుసుకుని వినూత్నంగా ఆలోచనలతో, దేశం గర్వించదగ్గ పనులు చేయాలని ప్రోత్సహించారు. కాగా ఆయన భార్య మేరీల్యాండ్ రాష్ట్రంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో పని చేస్తున్నారు. ఓ కుమార్తె మరియు అల్లుడు ఉన్నారు. సోదరుడు TN అశోక్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ (ఎకనామిక్స్ విభాగం)లో సేవలందిస్తున్నారు.


Click it and Unblock the Notifications