కరోనా వైరస్ మన జీవితాల్లో పెను మార్పులే తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరంగా అన్ని రంగాలు దెబ్బతిని ఉన్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి దాదాపు అన్ని షాపులు, వ్యాపారాలు తెరుచుకోవడంతో ప్రజలు మళ్ళీ రోడ్లపైకి వస్తున్నారు. షాపింగ్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. కానీ డబ్బులు మాత్రం చెల్లించటం లేదు. అదేంటి డబ్బులు కట్టకపోతే సరుకులు ఎలా ఇస్తారనుకుంటున్నారా? అవును, డబ్బులకు బదులు అన్నిటినీ వాయిదాల పద్ధతిలో కొనేస్తున్నారు.
ఎందుకంటే ఉన్న కొంచం డబ్బులు కూడా ఖర్చు చేస్తే మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి... నెల వాయిదాలకు జై కొడుతున్నారు. ఒకప్పుడు కేవలం అధిక ధరలు ఉండే వస్తువులనే ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే కస్టమర్లు... ప్రస్తుతం కరోనా వైరస్ తెచ్చిన కష్టాలతో మిక్సర్ గ్రైండర్లు, కిచెన్ సామాన్లు, స్మార్ట్ ఫోన్లు, స్పీకర్లు, హెడ్ ఫోన్లు.. చివరకు బూట్లు (షూస్) కూడా వాయిదాల పద్ధతిలోనే కొనేస్తున్నారు.

40% పెరిగిన వాయిదాలు...
కరోనా వైరస్ మన దేశం లోకి అడుగు పెట్టక ముందు పరిస్థితులతో పోల్చితే .. ప్రస్తుతం వినియోగదారులు అధికంగా వాయిదా పద్ధతికి జై కొడుతున్నారు. క్రెడిట్ కార్డులపై కొనుగోళ్ళకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కోవిడ్ కు ముందు కొనుగోలు సరళితో పోల్చితే ప్రస్తుతం ఈఎంఐ పద్ధతిలో కొనుగోళ్లు 30 శాతం నుంచి 40% వరకు పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి చిన్న కొనుగోలుకు కూడా వినియోగదారులు వాయిదా పద్ధతిలో చెల్లింపులనే ఇష్టపడుతున్నారు. కరోనా కు ముందు జరిగే వ్యాపారంలో ఇప్పుడు కేవలం 70% వరకు మాత్రమే జరుగుతోంది. కానీ అందులో మెజారిటీ వాయిదా చెల్లింపుల పద్ధతికి ఆసక్తి చూపుతుండటం విశేషం. ఇందులో కూడా మరో ఆసక్తికరమైన సరళి ఏమిటంటే... కిచెన్ వస్తువులు, లేదా ఇతర వస్తువులు తక్కువ ఖరీదు అయినవి వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఎక్కువ వాయిదాల్లో చెల్లించే ఆప్షన్ల ను ఎంపిక చేసుకుంటున్నారు.

మొబైల్స్ లో కూడా పెరుగుదల...
గతంలో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అధికంగా నగదు చెల్లించేవారు. కానీ ఇప్పుడు అందులోనూ పూర్తిగా మార్పొచ్చింది. ఇప్పుడు వినియోగదారులు ఎక్కువగా ఈఎంఐ పద్ధతినే ఆశ్రయిస్తున్నారని మొబైల్ రిటైలర్ల ద్వారా తెలుస్తోంది. విజయ్ సేల్స్, సంగీత మొబైల్స్, బిగ్ సి మొబైల్స్, గ్రేట్ ఈస్టర్న్ రిటైల్, కోహినూర్ వంటి రిటైల్ స్టోర్ల అమ్మకాలు దీనినే రుజువు చేస్తున్నాయి. గతంలో వినియోగదారులు మొబైల్స్ కొనుగోలు చేసేందుకు 50-60% వరకు ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకునేవారు అని, ప్రస్తుతం మాత్రం ఆ సంఖ్య భారీగా పెరిగిపోయిందని పేర్కొంటున్నారు. అయితే, వినియోగదారులు తక్కువ విలువ కలిగిన మొబైల్ ఫోన్ల నే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మే నెలలో సగటు మొబైల్ ఫోన్ చెల్లింపు ధరలో 25% క్షీణత నమోదు అయింది.

ఈకామర్స్ లోనూ అదే తీరు...
ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా ఇదే సరళిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం వినియోగదారులు ప్రతి చిన్న వస్తువును కూడా వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారని అవి పేర్కొంటున్నాయి. తమ ప్లాట్ఫారం అందించే అన్ని రకాల వాయిదా చెల్లింపుల ఆప్షన్స్ కస్టమర్స్ ఎంపిక చేసుకుంటున్నారని చెబుతున్నాయి. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్స్ విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఎక్కువ మంది వినియోగదారులు 18-24 నెలల ఈఎంఐ లకు జై కొడుతున్నారు. మహమ్మారి కరోనా వైరస్ దయ వల్ల దేశంలో కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. అదే సంఖ్యలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వేతనాలు 10% నుంచి 30% వరకు కోతలకు గురయ్యాయి. దీంతో, భవిష్యత్ ఎలా ఉంటుందో అనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. అందుకే, భారీ కొనుగోళ్ళకు బదులు.. చిన్న కొనుగోళ్లు, ఒకేసారి చెల్లించే బదులు... వాయిదాల్లో చెల్లించే పద్ధతికి సై అంటున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications